Actor jeeva Comments about Yatra 2: వైఎస్ జగన్ పాత్రలో జీవా నటించిన లేటెస్ట్ మూవీ యాత్ర 2. ఈ సినిమా మరో రెండు రోజుల్లా ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో సినిమా యూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఇక ఈ క్రమంలో జీవా మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ గారి పాత్రలో నటించడం కష్టంగా అనిపించిందని అన్నారు. జగన్ యూట్యూబ్, మీడియా నుంచి వీడియోలు రెగ్యులర్‌గా చూస్తూ ఉన్నా, జగన్ ఎలా మాట్లాడతారు? ఎలా నడుస్తారు? ఇలా ప్రతి ఒక్క విషయం మీద ఎంతో శ్రద్ధ తీసుకున్నా, ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చిందని అన్నారు. డైరెక్టర్ ఎప్పుడైతే షాట్‌కి ఓకే చెప్పారో అప్పుడు నాకు రిలీఫ్ అనిపించిందన్నారు. మహి ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు, ఆయన ఈ పాత్రకు నన్ను ఓకే చేయడానికే చాలా టైం తీసుకున్నారని అన్నారు. ప్రతి షాట్ ఓకే చెప్పడంతో నాకు పెద్ద రిలీఫ్‌లా అనిపించేదని అన్నారు.
Yatra 2: సినిమాలో వైయస్సార్ మరణానికి కారణాలు లేవు.. ఎవ్వరినీ కించపరచలేదు!
నేను జగన్ మోహన్ రెడ్డి గారిలానే కనిపిస్తున్నానని అప్పుడే నాకు అర్థమైందని, మొదటి షాక్ ఓకే చెప్పాక నేను మానిటర్ కూడా చూడలేదని అన్నారు. ప్రతిపక్షం నుంచి ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? అని మమ్ముట్టిని అడిగా, మనం యాక్టర్స్.. ఇది క్రియేటివ్ స్పేస్.. ఇది కేవలం సినిమాలనే చూడు అని ఆయన చెప్పారు. చూడు నాన్నా అనే పాట చిత్రీకరిస్తున్నప్పుడు చాలా ఎమోషన్‌కు లోనయ్యానని అన్నారు. వైఎస్ భారతి భారతి పాత్రలో నటించిన కేతకి నారాయణ్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి ఓ రియల్ పాత్రను పోషించడం ఇదే మొదటిసారి. ఇది నా మాతృభాష కాదు, నేను మరాఠీ, హిందీల్లో నటించాను. తెలుగులో ఇది నాకు మొదటి సినిమా. భారతికి ఓ ఇమేజ్ ఉంది, ఆమె గురించి ఎక్కువగా తెలుసుకున్నా. పులివెందులలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ పాత్రలోని ఇంటెన్సిటీ నాకు అర్థమైందని ఆమె అన్నారు.