Abhishek Nama Excludes Naveen medaram’s Name from Devil Movie: ముందుగా కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్న అభిషేక్ నామా. అభిషేక్ పిక్చర్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించి సినీ నిర్మాణం మొదలుపెట్టాడు. బాబు బాగా బిజీ అనే ఒక అడల్ట్ కామెడీ సినిమాతో నిర్మాతగా మారిన ఆయన కేశవ, సాక్ష్యం లాంటి సినిమాలు చేశాడు. తర్వాత గూడచారి సినిమాతో హిట్టు అందుకున్నా రావణాసుర సినిమాతో మరోసారి డిజాస్టర్ మూట కట్టుకున్నాడు. ప్రస్తుతానికి కళ్యాణ్ రామ్ హీరోగా డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలం అయింది. అనౌన్స్ చేసిన సమయంలో ఈ సినిమాని కుర్రదర్శకుడు నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తాడని అనౌన్స్ చేశారు. ఈ మేరకు అట్టహాసంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. పలు షెడ్యూల్స్ షూటింగ్ కూడా జరిగింది నవంబర్లో సినిమా రిలీజ్ కి దగ్గరవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ మధ్య ప్రమోషన్స్ కాస్త స్పీడ్ పెంచారు. ఈ ప్రమోషన్స్ లో ఏకంగా డైరెక్టర్ పేరు లేపేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఏకంగా నవీన్ మేడారం పేరు తప్పించి తాజాగా విడుదలైన పోస్టర్లలో ఒక పోస్టర్లో దర్శక నిర్మాతగా తన పేరే వేసుకుంటే మరొక పోస్టర్లో ఈ ఫిలిం బై అభిషేక్ పిక్చర్స్ అంటూ తన నిర్మాణ సంస్థ పేరు వేయడం హాట్ టాపిక్ అవుతుంది.
Navadeep: నేనెక్కడికి పారిపోలేదు.. నాకు డ్రగ్స్ కేసుతో సంబంధమే లేదు!
కొద్ది రోజుల క్రితమే విజయ్ దేవరకొండ కోటి రూపాయల ఖుషీ ఫండ్ అనౌన్స్ చేసిన సమయంలో తమకు వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకి సంబంధించి ఎనిమిది కోట్ల నష్టం వాటిల్లింది వాటి సంగతి కూడా చూడాలని చెప్పి ఆయన అభిమానులకు అభిషేక్ నామా టార్గెట్ అయ్యాడు. పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి కానీ ఈ విషయం మీద అభిషేక్ సైలెన్స్ పాటించాడు. అయితే ఇప్పుడు ఇలా కష్టపడి సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ని పక్కకు తప్పించి అతనికి ఇవ్వాల్సిన క్రెడిట్ కూడా ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్ట్?. నిజానికి సినిమా షూట్ లో ఉన్నప్పుడు నవీన్ మేడారం అభిషేక్ నామా మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని చెబుతున్నారు. గతంలో అనేక సినిమాల విషయంలో నటీనటులకు లేదా ఇతర టెక్నీషియన్లకు అలాగే క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి సినిమా నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడే ముందు సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా వేదికగా ఒక క్లారిటీ ఇచ్చి అధికారికంగా ఆ ప్రాజెక్టు నుంచి సదరు నటీనటులు కానీ టెక్నీషియన్లు కానీ తప్పుకునేవారు.
కానీ అసలు ఈ సినిమా విషయంలో ఏం జరిగిందనే క్లారిటీ కూడా లేకుండా ఎప్పుడో గతంలో రిలీజ్ చేసిన యూట్యూబ్ వీడియోలకు సైతం దర్శకుడుగా తన పేరే వేయించుకున్నారు అభిషేక్ నామా. నిజంగానే నవీన్ మేడారంకు ఈ సినిమా విషయంలో అన్యాయం జరిగి ఉండకపోవచ్చు, ఆయనకు తగిన పారితోషకం ఇచ్చి పక్కకు తప్పుకోమని కోరి ఉండవచ్చు. ఒకవేళ ఆయనకు అన్యాయం జరిగి ఉంటే ఈపాటికి ఆయన దర్శకుల సంఘంలో లేదా సినీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి సాల్వ్ చేసుకునేవాడు. అయినా సరే ఒక సినిమాని డైరెక్ట్ చేసిన అతనికి ఇవ్వాల్సిన మినిమం క్రెడిట్ కూడా ఇవ్వకపోవడం దారుణం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇలా ఒకరి కష్టాన్ని తన కష్టంగా చెప్పుకునే వ్యక్తి మరో హీరోని నష్టాలు క్లియర్ చేయమని అడగడమా అంటూ విజయ్ అభిమానులు అభిషేక్ నామాను ప్రశ్నిస్తున్నారు. అయితే నవీన్ కి, అభిషేక్ నామానికి మధ్య ఏం జరిగింది? ఎందుకు నవీన్ ఈ డెవిల్ సినిమా నుంచి తప్పుకున్నాడు అనే విషయం అధికారికంగా క్లారిటీ ఇస్తే తప్ప ఈ వ్యవహారంలో ఏం జరిగిందనేది తెలిసే అవకాశం కనిపించడం లేదు.