Navadeep Responds to Absonding Allegations made by Hyderabad Police: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తీగలాగితే డొంక కదిలినట్లు ముగ్గురు నైజీరియన్ లతో పాటు ఒక సినీ నిర్మాత, ఒక మాజీ ఎంపీ కుమారుడు సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జరిపిన ఒక ఆపరేషన్ లో భాగంగా వీరంతా పట్టుబడ్డారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ హీరో నవదీప్ పబ్ కి కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందని, ఆయన కూడా డ్రగ్స్ తీసుకున్నాడు అని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఇదే విషయం మీద ఆయన మాట్లాడుతూ ప్రస్తుతానికి నవదీప్ కానీ ఆయన కుటుంబం కానీ అందుబాటులో లేదని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కుటుంబంతో సహా పరారీ అయ్యాడని అంటూ కామెంట్లు చేశారు. ఇదే విషయం మీద నవదీప్ ని ఎన్ టీవీ సంప్రదించే ప్రయత్నం చేసింది, ఈ క్రమంలో నవదీప్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వాట్సాప్ కి కాల్ చేయగా నవదీప్ అందుబాటులోకి వచ్చారు.
Tollywood Drugs case: చిక్కుల్లో బేబీ టీమ్.. డ్రగ్స్ కేసులో నోటీసులు?
అసలు ఈ డ్రగ్స్ వ్యవహారం గురించి తనకు తెలియదని, తనకు ఈ డ్రగ్స్ కేసులో ఏమాత్రం సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఎక్కడికి పారి పోలేదని, ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నానని అన్నారు. లవ్ మౌళి అనే తన కొత్త సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచింగ్ ఈవెంట్ కూడా జరగనుంది అని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అంతేకాక తాను కూడా ప్రెస్ మీట్ చూశానని ఆనంద్ హీరో నవదీప్ అని ఎక్కడా మెన్షన్ చేయలేదు కదా వేరే నవదీప్ అయి ఉంటాడని చెప్పుకొచ్చారు. అయితే సివి ఆనంద్ ప్రస్తావించింది మీ గురించే అని ఆయన దృష్టికి తీసుకువస్తే ఆయన తనకు ఈ కేసుతో ఏ మాత్రం సంబంధం లేదని చెప్పుకొచ్చారు. అంతేకాక తాజాగా ఆయన ట్విట్టర్ ద్వారా కూడా స్పందించారు. అది నేను కాదు జెంటిల్మెన్, నేను ఇక్కడే ఉన్నాను ముందు క్లారిటీ తెచ్చుకోండి థాంక్స్ అంటూ రాసుకొచ్చారు