Abhishek Bachchan : అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకుంటారంటూ ఎప్పటి నుంచో రూమర్లు వస్తున్నా ఎవరూ స్పందించట్లేదు. వాటిని ఖండించకపోవడంతో ఈ రూమర్లు మరింత ఎక్కువ అవుతున్నాయి. పైగా ఇద్దరూ కలిసి బయట ఎక్కడా కనిపించట్లేదు. అప్పుడప్పుడు బచ్చన్ చేస్తున్న పోస్టులు సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఆయన మరో షాకింగ్ పోస్ట్ చేశాడు. నాకు ఇష్టమైన వాళ్లకోసం అన్నీ ఇచ్చేసా. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు.
Read Also : Shekar Kammula : అలా చేసి కోట్లు నష్టపోయా..
కొన్ని రోజులు ఈ సమాజానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా. నా కోసం టైమ్ కేటాయిస్తా. నన్ను నేను చాలా కోల్పోయా. నా కోసం అన్నీ తెలుసుకుంటా. నన్ను నేను ప్రేమించుకోవడానికి ఇదే సరైన సమయం. ఈ బ్రేక్ నాకు చాలా ముఖ్యం అంటూ అందులో రాసుకొచ్చాడు. ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఐశ్వర్య రాయ్ గురించే ఈ పోస్ట్ చేశాడేమో అంటున్నారు నెటిజన్లు. కొంపదీసి ఐశ్వర్యకు అన్నీ ఇచ్చేసాడా అంటున్నారు. ఇంత డెప్త్ గా పోస్ట్ చేశాడంటే కచ్చితంగా పర్సనల్ లైఫ్ బాగా లేదేమో అంటున్నారు. త్వరలోనే కొత్త అభిషేక్ బచ్చన్ ను చూస్తారంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరి ఐశ్వర్య నుంచి ఇలాంటి పోస్ట్ ఏదైనా వస్తుందా లేదా చూడాలి.
Read Also : Shyamali De : సమంత-రాజ్ డేటింగ్ రూమర్లు.. డైరెక్టర్ భార్య షాకింగ్ పోస్ట్