ENE Repeat: సత్యకు గట్టి పోటీ.. ‘ఈఎన్ఈ రిపీట్’తో లీగ్ `లోకి అభినవ్ గోమఠం

Eenagaraniki Emaindi 2

Eenagaraniki Emaindi 2

టాలీవుడ్‌లో ప్రస్తుతం యంగ్ కమెడియన్ల హవా నడుస్తోంది. ముఖ్యంగా తనదైన బాడీ లాంగ్వేజ్, టైమింగ్‌తో సత్య ఇప్పటికే సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. కామెడీలోనే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అయితే ఇప్పుడు సత్య రేంజ్‌లో ప్రేక్షకులను అలరించడానికి మరో టాలెంటెడ్ నటుడు దూసుకొస్తున్నాడు. అతనే అభినవ్ గోమఠం. కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో కౌశిక్ పాత్రలో అభినవ్ సృష్టించిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో తన మార్క్ చూపించినా, ఇప్పుడు సీక్వెల్‌గా వస్తున్న ‘ఈఎన్ఈ రిపీట్’ (ENE 2) మాత్రం అభినవ్ కెరీర్‌ను మరో మలుపు తిప్పేలా కనిపిస్తోంది. ఈ సినిమాకు అభినవ్ గోమఠం సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారాడు. నిజానికి ఈ సీక్వెల్‌కు అతనే అసలైన స్టార్ అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్ అనగానే సత్య పేరే ముందుగా వినిపిస్తుంది. ఏ సినిమాలో ఉన్నా తన మార్క్ కామెడీతో ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే సత్తా సత్యకు ఉంది. ఇప్పుడు ‘ఈఎన్ఈ రిపీట్’ క్రేజ్ చూస్తుంటే, అభినవ్ గోమఠం కూడా అదే ప్రామిసింగ్ కమెడియన్స్ లీగ్‌లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది..అభినవ్ పలికే డైలాగ్ డెలివరీ, పక్కా లోకల్ యాస యువతకు బాగా కనెక్ట్ అవుతున్నాయి..సీక్వెల్‌లో మిగతా పాత్రల కంటే అభినవ్ పాత్రకే ఎక్కువ స్కోప్, కామెడీ వర్కౌట్ అయింది. మొత్తానికి సత్య తర్వాత ఆ స్థాయిలో ఆడియన్స్‌ను నవ్వించే సత్తా ఉన్న కమెడియన్‌గా అభినవ్ గోమఠం నిలదొక్కుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ‘ఈఎన్ఈ రిపీట్’ విడుదల తర్వాత టాలీవుడ్ కామెడీ లెక్కలు మారడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.