బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. సినిమాల నుంచి రిటైర్ మెంట్ ప్రకటించాలని అనుకున్నారు. ఏంటి ఇది నిజమా.. అయితే అమీర్ ఇక సినిమాలలో కనిపించడా..? అంటే కనిపిస్తారు. సినిమాలకు రిటైర్ మెంట్ ప్రకటించాలని ఒకానొకప్పుడు అనుకున్నారట.. ఆ విషయాన్నీ ఆయన ఇప్పుడు బయటపెట్టడంతో ఈ వార్త అభిమానులను కలవరింతకు గురిచేసింది. అసలు విషయమేంటంటే.. అమీర్ ఖాన్ బాలీవుడ్ లో స్టార్ హీరో.. వరుస సినిమాలతో బిజీగా ఉంటూ ఫ్యామిలీకి దూరమయ్యాడట.. ఆ సమయంలో పిల్లలను చాలా మిస్ అయ్యాడట అమీర్. దీంతో సినిమాలకు రిటైర్ మెంట్ ప్రకటించి.. పిల్లలతో సమయం గడపాలని అనుకున్నాడట.
” నా రిటైర్ మెంట్ ఆలోచన గురించి ఇంట్లో చెప్తే వాళ్ళందరూ నాది తప్పు ఆలోచన అని చెప్పారు. సినిమాలే నాకు, నా కుటుంబానికి గ్యాప్ వచ్చేలా చేసిందని, అందుకే గ్యాప్ తీసుకుంటున్నా అని చెప్పేశా.. అయితే లాల్ సింగ్ చద్దా సినిమా విడుదల సమయంలో ఇలాంటివి చేస్తే ప్రమోషన్ స్టంట్ అనుకుంటారని మానేశా.. సాధారణంగా నేను సినిమా.. సినిమాకు నాలుగేళ్లు గ్యాప్ తీసుకుంటా.. ఈసారి కూడా అదే పని చేద్దామనుకుంటున్నా.. లాల్ సింగ్ చద్దా సినిమా తర్వాత మూడు, నాలుగేళ్ల వరకు ఎవరికీ ఇబ్బంది ఉండదు. లాక్ డౌన్ సమయంలో నా రిటైర్ మెంట్ నిర్ణయం ఇంట్లో పెద్ద తుఫాన్ నే తీసుకొచ్చింది. ఆ సమయంలో కిరణ్ అయితే నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చేసి ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకండి అని చెప్పింది. దీంతో నేనే అర్ధం చేసుకొని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను.” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.