ప్రస్తుతం సినిమా వ్యాపారం ఆశించినంత లాభదాయకంగా లేదు. కోట్లకి కోట్లు పెట్టి నిర్మిస్తున్న స్టార్ సినిమాలు బొక్క బోర్లా పడుతున్నాయి. బయ్యర్స్ కు భారీ నష్టాలు మిగులుస్తున్నాయి. పోస్టర్స్ లో ఉండే నంబర్ కు అసలు నంబర్స్ కు పోలికే ఉండదు. కానీ తాజాగా రిలీజ్ అయిన చిన్న సినిమా ప్రీమియర్స్ తోనే ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఆ సినిమానే కోర్ట్. నేచురల్ స్టార్ నాని సొంత నిర్మాణసంస్థ అయిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని నిర్మించిన చిత్రం ‘కోర్ట్’.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు వెబ్ సిరీస్ లు ఏవంటే..?
సినీనటుడు శివాజీ, హాస్యనటుడు ప్రియదర్శ, హర్షవర్ధన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను యంగ్ దర్శకుడు రామ్ జగదీష్ డైరెక్ట్ చేసాడు. కాగా ఈ సినిమా కంటెంట్ పై నమ్మకంతో రెండు రోజుల ముందుగా నిర్మాత నాని ప్రీమియర్ లు ప్లాన్ చేసాడు. ఈ నేపధ్యంలో నాని ‘కోర్ట్’ సినిమా మీకు నచ్చకుంటే మరో రెండు నెలల్లో నేను హీరోగా నటించిన ‘హిట్ 3′ సినిమా సినిమాను చూడకండి అని భారీ స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చాడు. నాని చెప్పినట్టుగా మొదటి రోజు ప్రీమియర్స్ కు భారీ స్పందన వచ్చింది. దీంతో రెండవ రోజు ఏకంగా 75 ప్రీమియర్స్ ప్రదర్శించారు. అన్ని ఏరియాలలో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడిన ఈ సినిమా ప్రీమియర్స్ రూపంలోనే రూ. 2 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. శుక్రవారం విడుదలైన కోర్ట్ ఓవర్సీస్ లోను వారాంతం నాటికి 500K డాలర్స్ రాబడుతుందని అంచనా. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ రేపటిలోగా బ్రేక్ ఈవెన్ సాధించి బయర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టనుంది.