మలయాళ సినీ పరిశ్రమనే కాకుండా మొత్తం దక్షిణాదినే షేక్ చేసిన చిత్రం ‘ప్రేమమ్’.. తెలుగులో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించగా.. శ్రుతీహాసన్, అనుపమ, మడోన్నా సెబాస్టైన్ హీరోయిన్లుగా నటించారు. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర వంశీ నిర్మించారు. కాగా, ప్రేమమ్ చిత్రం వచ్చి నేటికీ ఐదేళ్లు అవుతోంది.
ఓ యువకుని జీవితంలో జరిగే మూడు అందమైన ప్రేమకథలను తెర మీద అద్భుతంగా ఆవిష్కరించారు. మూడు పాత్రల్లోనూ నాగచైతన్య ఇమిడిపోయి నటించగా.. పూర్తి స్థాయి పరిపూర్ణతను కనబరిచాడు. తెలుగు నేటివిటీకు తగ్గట్లు కొన్ని మార్పులు చేసినప్పటికీ సినిమాలో సోల్ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఈ స్వచ్ఛమైన ప్రేమకథ.. అందరి హృదయాలను హత్తుకునేలా ఉండటంతో తెలుగులోనూ హిట్ చిత్రంగా నిలిచింది. విక్టరీ వెంకటేశ్, నాగార్జున ఈ సినిమాలో ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. గోపిసుందర్ మ్యూజిక్ ఈ చిత్రంలో హైలైట్ గా కాగా.. కార్తీక్ ఘట్టమనేని ఫోటోగ్రఫి మరింత బలాన్ని చేకూర్చింది.
లవ్ స్టోరీస్ ఇండ్.. ఫీలింగ్స్ డోంట్…