2018: ఈ ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు లిస్ట్ లో ఖచ్చితంగా 2018 సినిమా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. టొవినో థామస్, లాల్ అసిఫ్ అలీ, నరేన్, కుంచుకో బోబన్ తదితరులు ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమాను తెలుగులో బన్నీ వాస్ రిలీజ్ చేశాడు. మే 25 న రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా భారీ వసూళ్లను అందుకుంది. 2018లో కేరళను అతలాకుతలం చేసిన వరద బీభత్సం చుట్టూ తిరిగే కథ కావడంతో వాస్తవిక ఘటనలను కళ్ళకు కట్టినట్లు చూపించి దర్శకుడు ఒక మెట్టు ఎక్కేశాడు. ఇక ‘ఆహా’ అనువాద చిత్రాల ద్వారా టోవినో తెలుగువారికి కూడా సుపరిచితుడుగా మారాడు. కథ బావుందని టాక్ రావడంతో అభిమానులు కూడా సినిమాను ఆదరించారు.
Dhanush: యో.. ఇదేం లుక్ అయ్యా.. సడెన్ గా చూసి రామ్ దేవ్ బాబా అనుకుంటిమే
ఇక ఈ సినిమా ఓటిటీ బాట ఎప్పుడు పడుతుందా..? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా ఓటిటీ డేట్ వచ్చేసింది. సోనీలివ్ ఈ సినిమా హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిందట. జూన్ 7 నుంచి సోనీలివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం. మరి థియేటర్ లో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓటిటీలో ఎలాంటి రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలంటే వచ్చే నెల వరకు ఆగాల్సిందే.