Rashmika Mandanna: అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి.. బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్ట.. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక పరిస్థితి అలాగే ఉంది. కన్నడ ఇండస్ట్రీ లో మొదటి సినిమాతోనే హిట్ అందుకొని టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ ఇక్కడ కూడా వరుస విజయాలను అందుకొని నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు తెచ్చుకుంది. కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా వరుస అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ బ్యూటీ బాలీవుడ్ లో పాగా వేద్దామని మంచి ప్లాన్ వేసింది. అనుకున్నదే తడువుగా మంచి అవకాశాన్ని చేజిక్కించుకొంది. మొదటి సినిమానే బిగ్ బి అమితాబ్ తో నటించే అదృష్టం దక్కించుకుంది.
గుడ్ బై అనే సినిమాతో రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాపై అమ్మడి ఎన్నో ఆశలు పెట్టుకుంది. థియేటర్ లో రిలీజ్ అయ్యి, అమితాబ్ సినిమాలో నటించినందుకు మంచి పేరు వస్తుందని అనుకున్నది.. కానీ, ఆ సినిమా చివరికి ఓటిటీ బాట పట్టింది. సరే ఓటిటీలోనైనా ఏమైనా హిట్ అందుకుందా అంటే అది కూడా అంతంత మాత్రంగానే ఆడింది. అయినా రష్మిక వెనకడుగు వేయలేదు. ఈ సినిమా పోతే ఏంటి మరో సినిమా ఉంది కదా అంటూ.. సిద్దార్థ్ మల్హోత్రా తో మిషన్ మజ్ను ను పట్టాలెక్కించింది. ఇక ఈ సినిమా కోసం రష్మిక వెయ్యి కళ్ళతో ఎదురుచూసింది. ఈ సినిమా కోసమే సౌత్ ఇండస్ట్రీ పై కామెంట్స్ చేసి విమర్శల పాలు కూడా అయ్యింది. ఏది అయితే అది అయ్యింది.. కనీసం ఈ మూవీ అయినా థియేటర్ లో రిలీజ్ అయ్యి మంచి పేరు వస్తే చాలు అనుకున్నది. కానీ, ఈసారి కూడా అమ్మడి ఆశలు అడియాశలే అయ్యాయి.
మిషన్ మజ్ను కూడా ఓటిటీ బాట పట్టడంతో రష్మిక బాధ అంతా ఇంత కాదు. ఎన్నో ఆశలతో బాలీవుడ్ లోకి అడుగుపెడదామనుకున్న అమ్మడి ఆశలు నీరుకారిపోయాయి. దీంతో పాపం.. రష్మికకు ఎంత కష్టం వచ్చింది అని కొందరు అంటుండగా.. సరిపోయిందా..? బాలీవుడ్ బాలీవుడ్ అని వెళ్ళావ్ ఏమైంది అని మరికొందరు ట్రోల్స్ చేస్తున్నారు. జనవరి 20న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటిటీ లో ఈ సినిమా అయినా హిట్ ను అందుకుంటుందో లేదో చూడాలి.