హార్ట్ ఎటాక్ లు.. స్ట్రోక్..లు, కార్టియాక్ అరెస్ట్ లు వంటివి ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా వస్తుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే తీవ్ర ఒత్తిడితో హార్మోన్లు పెరిగడం.. రక్తం చిక్కబడడంతో.. గుండెపోట్లు వచ్చే అవకాశాలున్నాయిని కార్టియాలజిస్ట్లు వెల్లడించారు. సకాలంలో వీటిని గుర్తించి.. వైద్య సహాయం పొందడంతో.. బయట పడవచ్చని అంటున్నారు.
Read Also: Students Washing Bowles: మధ్యాహ్న భోజనం పథకం.. పిల్లలతోనే.. గిన్నెలు తోమిస్తున్న పాఠశాల సిబ్బంది..
అయితే గుండెపోటు ఎక్కువగా తెల్లవారు జామునే వస్తాయో.. డాక్టర్లు వెల్లడించారు. ఈ మధ్య కాలంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో ఈ గుండెపోట్లు వస్తున్నాయి. వీటికి కరెక్ట్ టైం వైద్యం అందించకపోతే.. ప్రాణాలు పోయే పరిస్థితి రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండెపోట్లు తెల్లవారుజామున ఉదయం 4:00 గంటల నుండి 8:00 గంటల మధ్య రావడం చాలా సాధారణమని వైద్య నిపుణులు తెలిపారు. అయితే.. వీటిని సకాలంలో గుర్తిస్తే.. ప్రమాదం నుంచి బయట పడే అవకాశాలు లేకపోలేదని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. హార్మోన్లు ఎక్కువ పెరగడంతో గుండె పోట్లు వస్తాయని డాక్టర్లు తెలిపారు. అంతే కాకుండా మనం మేల్కోనే సమయంలో. కార్టిసాల్, కాటెకోలమైన్‌లు వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీంతో.. గుండెపోటు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Read Also:Hospital Wedding: ఐసీయూలో ఉన్న యువతి మెడలో తాళి కట్టిన యువకుడు..షాక్ లో సిబ్బంది
అయితే ఈ హార్మోన్ల పెరుగుదల రక్తపోటు, హృదయ స్పందన రేటును పెంచతుంది.. అంతే కాకుండా హృదయనాళ వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించడంతో.. గుండె పోట్లు, స్ట్రోక్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఎర్లీ మార్నింగ్ గుండె పోటు రావడానికి ప్రధాన కారణం రక్తం గడ్డకట్టడం. ఉదయం కార్టిసాల్ స్థాయిలు పెరగడంతో PAI-1 అనే ఎంజైమ్.. రక్తం గడ్డకట్టడాన్ని విచ్ఛిన్నం చేసే శరీరం యొక్క సహజ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అయితే రాత్రి టైంలో ఎక్కువగా నీరు తాగకపోవడం వల్ల కూడా… రక్తం డిహైడ్రేషన్‌కు గురై చిక్కగా మారే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. మేము ఈ సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి గ్రహించామని గ్రహించాలి.. మీరు ఏదయినా.. సలహాలు, సూచనలు కావాలంటే వైద్యుడిని సంప్రదించం మంచిది.