ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్ లో విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. ఇంటి నుంచి భోజనం తెచ్చుకులోని పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రవేశ పెట్టింది. అయితే.. ఓ పాఠశాలలో విద్యార్థులతో.. వంట పాత్రలను తోమిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: HDFC Bank Alert: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అలర్ట్.. నెట్ బ్యాంకింగ్ సర్వీసులు రద్ధు..!
పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్ రూరల్ జిల్లా చాక్సూ నంబర్ 1కు చెందిన ప్రాథమిక విద్యాలయంలో.. పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టారు స్కూల్ యాజమాన్యం. అయితే.. భోజనం చేసిన తర్వాత.. వండిన గిన్నెలను పిల్లలతోనే కడిగించారు. చిన్న చిన్న పిల్లలు గిన్నెలను శుభ్రం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు స్కూల్ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పిల్లలు గిన్నెలను కాదు భవిష్యత్తును కడిగేస్తున్నరు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మీ పిల్లలను అయితే ఇలాగే కడిగిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడుకోవాల్సిన పిల్లల చేతులు కష్టం చేస్తున్నాయని.. ఇంట్లో కూడా ఇలాంటి పనులు చేసి ఉండరని కామెంట్లు పెడుతున్నారు..
अपना भविष्य धोते बच्चे
यह मामला चाकसू (जयपुर ग्रामीण) के राउप्रावि. चाकसू नं. 1 का है अब देखना यह होगा शिक्षा मंत्री @madandilawar जी आपकी मिजोरम यात्रा पूर्ण हो गई हो तो इस मामले पर ध्यान देकर बच्चों के भविष्य की यात्रा जल्द सुगम करेंगे
हमें भी आपके एक्शन का इंतजार रहेंगे pic.twitter.com/jsAu51jmDu— Ashok Shera (@ashokshera94) November 21, 2025