కేరళలో ఓ వింత ఘటన జరిగింది. ఓ యువకుడు ఐసీయూలో ఉన్న యువతికి తాళి కట్టాడు. అయితే.. ఇద్దరికి శుక్రవారం మధ్యాహ్నం పెళ్లి జరగాళ్సి ఉంది. వధువు అలంకరణ కోసం వెళుతుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఐసీయూకు తరలించారు. అక్కడ పెద్దల సమక్షంలో వరుడు.. వధువుకి తాళి కట్టాడు. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది.
Read Also: BOI SO Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ పోస్టులు.. నెలకు శాలరీ రూ. లక్ష కంటే ఎక్కువ
పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని తంబోలికి చెందిన వీఎం శరణ్, అలప్పుకి చెందిన అవనికి శుక్రవారం మధ్యాహ్నం పెళ్లి జరగాలి.. అయితే.. వధువును అలంకరణ కోసం తీసుకెళ్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఆమెకు వెన్నెముక భాగంలో గాయాలయ్యాయి. వెంటనే యువతిని కొట్టాయంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రత్యేక వైద్యం కోసం అక్కడి నుంచి కోచిలోని మరో ఆసుపత్రికి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు.
Read Also:WPL 2026 Auction List: ప్లేయర్‌ల వేలం లిస్ట్ విడుదల.. 73 స్థానాల కోసం 277 మంది పోటీ!
అయితే అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. డాక్టర్లను సంప్రదించడంతో.. వారు కూడా ఒప్పుకున్నారు. వెంటనే ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పెళ్లి జరిపించేలా ఏర్పాట్లు చేశారు. కొద్ది మంది కుటుంబ సభ్యులు సమక్షంలో అనుకున్న ముహుర్తానికి వరుడు.. వధువు మెడలో తాళిని కట్టేశాడు. అయితే ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది.. రోగులు మాత్రం కొంత షాక్ గురయ్యారు. అనంతరం వారంతా నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ICUలో జరగిన ప్రత్యేక వివాహం
ప్రమాదంతో ICUలో చేరిన అవనిని, నిర్ణయించిన ముహూర్తానికే వరుడు శరణ్ ఆస్పత్రిలోనే వివాహం చేసుకున్నాడు.
కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన శరణ్, వైద్యుల అనుమతితో అవనికి ముందు అనుకున్న ముహూర్తానికి తాళి కట్టాడు. pic.twitter.com/mQMeeWJcCR
— greatandhra (@greatandhranews) November 21, 2025