Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Sabja Seeds Check For Skin Problems With Sabja Seeds

Sabja Seeds : చర్మ సమస్యలకు సబ్జా గింజలతో చెక్..!

NTV Telugu Twitter
Published Date :May 15, 2025 , 9:42 am
By Mounika
Sabja Seeds : చర్మ సమస్యలకు సబ్జా గింజలతో చెక్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సబ్జా గింజలు.. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా, వేసవిలో వేధించే వేడిని తగ్గిస్తాయి. శరీరం నుంచి టాక్సిన్స్‌ను బయటికి పంపడంలోనూ సాయపడుతాయి. అయితే, అందాన్ని కాపాడటంలో సబ్జా గింజలు బాగా ఉపయోగపడతాయి. యవ్వనంగా కనిపించాలంటే, అందంగా మెరిసిపోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఈ క్రమంలోనే కొందరు ఇంట్లో లభించే పదార్థాలతో ఫేస్ ప్యాక్‌లు తయారు చేసుకుంటే, మరికొందరు బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే పార్లర్​కు వెళ్లే పని లేకుండా సహజంగా అందాన్ని పెంపొందించుకోవాలంటే సబ్జా గింజలు ఆహారంలో భాగం తీసుకోవాలంటున్నారు నిపుణులు. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య పరంగానే కాదు, సౌందర్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా..!

Also Read : Nani : దుల్కర్‌ సల్మాన్‌ తో నాని మూవీ ..

1. కొంతమందికి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చాయంటే అంత త్వరగా తగ్గవు. అలాంటివారు క్రమం తప్పకుండా సబ్జా గింజలు ఆహారంగా తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చర్మ ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.

2. చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు సబ్జా గింజల్లో ఉండే విటమిన్ ఇ సహాయపడుతుంది. అంతే కాకుండా ఈ గింజల్లో విటమిన్ ఎ, సి, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవన్నీ చర్మ సౌందర్యాన్ని పెంచుతాయని, ఈ గింజల వల్ల చర్మానికి తగినంత పోషణ అంది ఆరోగ్యంగా, మృదువుగా ఉంటుందని చెబుతున్నారు.

3. మహిళలు 30 ఏళ్ళు రాగానే ఎదుర్కొనే సమస్యల్లో, చర్మం ముడతలు పడడం మొదటి సమస్య. దీని వల్ల చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. దీంతో చాలా మంది యాంటీ ఏజింగ్ క్రీమ్​లను వాడుతుంటారు. కానీ ఈ సమస్యకు మేలైన పరిష్కారం సబ్జా గింజల్లోని పోషకాలు. ఇక ఈ గింజలతో తయారు చేసిన ఫేస్​ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. చెంచా కొబ్బరి నూనెలో సరిపడినంత సబ్జా గింజల పొడిని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. దీని వల్ల త్వరగా రిజల్ట్ కూడా ఉంటుంది.

4. తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్‌తో నిండిన సబ్జా గింజలు ఆకలిని నియంత్రిస్తాయి. ఫలితంగా బరువు తగ్గడంలో సాయపడతాయి. అలాగే సబ్జా గింజల్లో ఉండే యాంటి బయోటిక్‌, యాంటి ఫంగల్‌, యాంటి మైక్రోబియల్‌ లక్షణాలు.. చర్మ స్థితిస్థాపక లక్షణాలు చర్మం త్వరగా కోలుకోవడానికి తోడ్పడతాయి.

5. చర్మానికే కాదు.. జుట్టుకు సబ్జా గింజలు మంచి పోషణ అందిస్తాయి. వీటిలో అధికంగా లభించే విటమిన్‌ కె, బీటా కెరోటిన్‌, ఇతర ప్రొటీన్లు.. జుట్టు, కుదుళ్లు దృఢంగా ఉండేలా చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అయితే సబ్జా గింజలు సహజసిద్ధమైనవే అయినా కొంతమంది పడకపోవచ్చు. కాబట్టి వాటిని వాడే ముందు వ్యక్తిగత నిపుణులు సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • benefits
  • Sabja Seeds
  • skin problems

తాజావార్తలు

  • Off The Record: వైసీపీ అధిష్టానం ఆ విషయంలో ఎందుకు తికమక పడుతుంది..?

  • Off The Record: వైసీపీలో పినెల్లిని తప్పించడానికి అధిష్టానం చూస్తుందా..?

  • Neha Sharma : ఘాటు అందాలతో రెచ్చిపోయిన నేహాశర్మ..

  • Off The Record: పలాసలో రగులుతున్న పొలిటికల్ కొలిమి

  • Iran – Israel War : లైవ్ లో యాంకర్ న్యూస్ చదువుతుండగా ఇజ్రాయెల్ దాడి..

ట్రెండింగ్‌

  • Rapido Rider: ర్యాపిడో రైడర్ దౌర్జన్యం.. మహిళా ప్రయాణికురాలిపై చెంపదెబ్బ.. వీడియో వైరల్

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions