Menstruation Pills: ఈ మధ్య కాలంలో కొంతమంది మహిళలు పీరియడ్స్‌ను వాయిదా వేసుకోవడానికి లేదా కంట్రోల్ చేసుకోవడానికి టాబ్లెట్లు వాడుతున్నారు. ఎవరికైనా ట్రిప్ ఉందని, ఫంక్షన్ ఉందని, లేదా గుడికి వెళ్లాలన్నా పీరియడ్స్ రాకుండా ఉండాలని ఈ మాత్రలు వేసుకుంటున్నారు. కానీ వీటికి వెనక చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయన్న విషయం చాలామంది గుర్తించరు.
Health Tips: ఇడ్లీ, దోసెలు కాదు.. ఆరోగ్యానికి మేలు చేసే చద్దన్నం ఎలా చేసుకోవాలంటే?
ఈ టాబ్లెట్స్ లో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది గర్భసంచికి ఒక రకమైన బూస్ట్‌లా పనిచేస్తుంది. టాబ్లెట్ తీసుకునేంతవరకు గర్భసంచి పొర (Uterine lining) సురక్షితంగా ఉంటుంది. ఒకసారి ఈ మాత్రలు ఆపేసినప్పుడు ఆ సపోర్ట్ తగ్గిపోతుంది. దాంతో బ్లీడింగ్ మొదలవుతుంది. అయితే ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్‌గా ఉపయోగించే i-Pillలో కూడా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది. ఇది అనుకోని (unplanned) ఇంటర్‌కోర్స్ తర్వాత వాడే మాత్ర మాత్రమే. ఒకసారి వాడితే సమస్య లేదు, కానీ తరచూ వాడటం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతుంది.
కొంతమంది ఈ మాత్రలను 2–3 రోజులకు ఒకసారి వేసుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే.. రుతుక్రమం సైకిల్ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. ఇంకా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి, బ్లోటింగ్ (ఉబ్బరం), వాటర్ రిటెన్షన్ వస్తాయి. అలాగే శరీరం బరువుపెరిగినట్టుగా అనిపిస్తుంది. అంతేకాకుండా శరీరం నీరసంగా కూడా మారుతుంది. ఇవి అన్ని హార్మోన్ల ప్రభావాలు అని డాక్టర్లు చెబుతున్నారు.
డాల్బీ విజన్, గూగుల్ అసిస్టెంట్ లతో వచ్చేసిన AKAI PowerView సిరీస్ టీవీలు!
ఇక వీటి నుండి బయపడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే.. పీరియడ్స్ కంట్రోల్ మాత్రలు డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. ముఖ్యంగా ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ మాత్రలు తరచుగా వాడితే భవిష్యత్తులో ఫెర్టిలిటీ సమస్యలు రావచ్చు. ఈ మాత్రలను అవసరం లేకుండా వాడకూడదు. కాబట్టి పీరియడ్స్ కంట్రోల్ పిల్స్ వాడేముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.