డాల్బీ విజన్, గూగుల్ అసిస్టెంట్ లతో వచ్చేసిన AKAI PowerView సిరీస్ టీవీలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AKAI PowerView TVs: ప్రసిద్ధ ఎలక్ట్రానిక్ బ్రాండ్ ఆకై (AKAI) భారత మార్కెట్లోకి తన టీవీల లైనప్‌ను విస్తరించింది. కొత్తగా విడుదల చేసిన ఈ PowerView సిరీస్ టీవీలు తాజా Google TV (Android 14) ప్లాట్‌ఫాం మీద రన్ అవుతాయి. ఈ సిరీస్‌లో 32 అంగుళాల HD రెడీ, 43 అంగుళాల 4K మోడల్, అలాగే భారీ 75 అంగుళాల QLED డిస్ప్లే లభిస్తున్నాయి.
PowerView సిరీస్‌లో MediaTek MT9603 చిప్‌సెట్ లభించనుంది. ఈ టీవీలు HDR10, Dolby Vision, HLG సపోర్ట్ చేస్తాయి. MEMC టెక్నాలజీ వల్ల పిక్చర్ క్వాలిటీ స్మూత్‌గా కనిపిస్తుంది. Google TVలో డైనమిక్ కలర్ కరెక్షన్, ఫాంట్ కస్టమైజేషన్ వంటి సౌకర్యాలు కలవు. వీటి ద్వారా కలర్ ఇంపెయిర్మెంట్ ఉన్నవారు, వయోవృద్ధులు సులభంగా ఉపయోగించుకోవచ్చు.
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
Baahubali The Epic : కీలక సన్నివేశాలు లేపేసిన జక్కన్న.. ఇది నీకు న్యాయమా..
తాజా Android 14లో మల్టీ లాంగ్వేజ్ సబ్‌టైటిల్ సపోర్ట్, గూగుల్ అసిస్టెంట్ వాయిస్ సెర్చ్, క్విక్ యాప్ యాక్సెస్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. అలాగే గూగుల్ డివైజెస్‌తో ఇన్టిగ్రేషన్ సులభంగా చేసుకోవచ్చు. జెస్చర్ కంట్రోల్స్, Miracast, న్యూ క్యాస్ట్ సపోర్ట్ ద్వారా మొబైల్ నుండి లో-లాటెన్సీ కాస్టింగ్ చేయవచ్చు.
ఈ కొత్త AKAI PowerView Series టీవీలు వివిధ సైజుల్లో లభిస్తున్నాయి. వీటిలో 32 అంగుళాల HD మోడల్, అలాగే 43″, 50″, 55″, 65″, 75″ 4K QLED మోడల్స్ ఉన్నాయి. డిస్ప్లే విషయానికి వస్తే.. 32″ మోడల్ 1366×768 రిజల్యూషన్, 3000:1 కాంట్రాస్ట్ రేషియోతో వస్తుండగా, 43 అంగుళాల నుంచి పై మోడల్స్ 3840×2160 రిజల్యూషన్, 120Hz గేమ్ మోడ్, డాల్బీ విజన్, MEMC సపోర్ట్‌తో వస్తాయి. స్టోరేజ్ పరంగా 32″ మోడల్ 1.5GB RAM, 8GB స్టోరేజ్‌తో లభిస్తుండగా.. 43″ నుంచి పై మోడల్స్ 2GB RAM, 32GB స్టోరేజ్‌ను అందిస్తున్నాయి.
ఆడియో విభాగంలో డాల్బీ, డిజిటల్, డిజిటల్+ సపోర్ట్ ఉంటే.. 43″ పై మోడల్స్ డాల్బీ ఆటం సౌండ్‌ను అందిస్తాయి. ఇవన్నీ Google TV (Android 14) ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తాయి. కనెక్టివిటీ ఫీచర్లలో HDMI పోర్టులు (32″లో 2, ఇతర మోడల్స్‌లో 3), USB x2, LAN, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. వీటితోపాటు గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ క్యాస్ట్, మిర క్యాస్ట్ (32″ మోడల్‌లో అందుబాటులో లేదు), పేరెంటల్ కంట్రోల్, ఫాస్ట్ బూట్, ట్యూనర్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి.
Home Insurance: ఇది విన్నారా..? కేవలం రూ.181కే మీ ఇంటికి భీమా సదుపాయం.. ఎలా చేసుకోవాలంటే!
ఇక ధరల విషయానికి వస్తే, AKAI PowerView Series టీవీలు రూ.13,990 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇవి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆఫ్లైన్ రిటైలర్ల వద్ద, అలాగే akaiindia అధికారిక వెబ్‌సైట్‌లో లభిస్తున్నాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!