Site icon NTV Telugu

Makhana: మఖానా తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Makhana

Makhana

మఖానాలో విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మఖానా కాల్షియం, మెగ్నీషియం, ఇనుము అద్భుతమైన మూలంగా పరిగణించబడుతుంది. మఖానా తినడం వల్ల శరీరంలోని పోషకాల లోపాన్ని అధిగమించవచ్చు. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ గింజలు ఆరోగ్యానికెంతో మేలని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని కొందరు పచ్చిగానే తీసుకుంటే.. మరికొందరు వేయించుకొని, ఉడకబెట్టుకొని, కూరల్లో, స్వీట్లలో భాగం చేసుకుంటారు. ఎలా తీసుకున్నా.. తామర గింజలతో ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

READ MORE: Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్‌ని అమెరికా ఆహ్వానించిందా..? వైట్‌హౌజ్ క్లారిటీ..

క్యాలరీలు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతాం. అయితే మఖానాతో ఆ సమస్య లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనిలో క్యాలరీల శాతం తక్కువ. వీటిలో ఉండే ప్రొటీన్‌, ఫైబర్‌.. ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. ఫలితంగా ఆహారపు కోరికల్ని అదుపులో పెట్టుకోవచ్చు.. అధిక బరువునూ తగ్గించుకోవచ్చు. తామర గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి వివిధ ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. గ్లైసెమిక్‌ ఇండెక్స్ తక్కువగా ఉండే ఈ గింజలు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి.

READ MORE: Tooth Brush: డేంజర్.. టూత్ బ్రష్‌ను ఎక్కువ కాలం వాడితే ఏమౌతుందంటే…

వీటిలోని క్యాల్షియం, మెగ్నీషియం.. ఎముకలు, దంతాల్ని దృఢంగా మారుస్తాయి. ఐరన్ రక్తహీనత సమస్య రాకుండా కాపాడుతుంది. మఖానాలో సోడియం తక్కువ.. పొటాషియం, మెగ్నీషియం.. వంటి ఖనిజాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మఖానాలోని ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కేవలం ఆరోగ్యాన్నే కాదు.. మఖానాతో చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు.

Exit mobile version