మఖానాలో విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మఖానా కాల్షియం, మెగ్నీషియం, ఇనుము అద్భుతమైన మూలంగా పరిగణించబడుతుంది. మఖానా తినడం వల్ల శరీరంలోని పోషకాల లోపాన్ని అధిగమించవచ్చు. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ గింజలు ఆరోగ్యానికెంతో మేలని నిపుణులు చెబుతున్నారు.