Litchi Side Effects: లీచీ పండ్లను ఎక్కువగా తింటున్నారా?.. జాగ్రత్తగా ఉండాల్సిందే! ప్రాణాలు పోతాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Do You Know Side Effects of Litchi: వేసవి కాలంలో అందరూ మామిడి పండ్ల మాదిరి.. లీచీ (లిచ్చి) పండ్లను కూడా తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. స్ట్రాబెరీ రూపంలో అందంగా ఉండే లిచీ పండ్లు భలే రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎందుకంటే లీచీలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. లిచీ పండ్లలో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. మన శరీరానికి అవసరమయ్యే ఆస్కార్బిక్ ఆమ్లం (ఏబీఏ) ఇందులో లభిస్తుంది. లీచీ పండ్లను తినడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు దూరమవుతాయి. రోగనిరోధక శక్తి బలపడడం, రక్తప్రసరణ మెరుగుపడటం, జీర్ణక్రియ మెరుగుదల, గుండె జబ్బులు రాకుండా ఉండడం లాంటివి ఉన్నాయి. కానీ లీచీ పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. లిచీ తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో చూద్దాం.
లో బీపీ:
లో బీపీ సమస్య ఉంటే లీచీ పండ్లని తినకుండా ఉండాలి. ఎందుకంటే వీటిని తినడం వల్ల రక్తపోటు తగ్గడమే కాకుండా.. అనేక ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే లో బీపీ సమస్య ఉన్నవాళ్లు లీచీ పండ్లని తినడం మానేయాలి.
Also Read
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
ఫుడ్ పాయిజనింగ్:
లీచీ పండ్లని అధికంగా తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. కొన్నిసార్లు కడుపు నొప్పి మరియు విరేచనాలు కూడా అవొచ్చు. కాబట్టి లీచీ వినియోగానికి దూరంగా ఉండాలి.
ఊబకాయం:
లీచీ పండ్లలో చక్కెర అధికంగా ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య రావచ్చు. కాబట్టి లిచీని అధికంగా తీసుకోవడం మానుకోవాలి.
అలెర్జీ సమస్య:
అలర్జీ సమస్య ఉన్నవారు లిచీలను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే మీకు లిచీ పడకుంటే.. అలెర్జీ సమస్య త్వరగా వస్తుంది. కాబట్టి లిచీని అధికంగా తీసుకోవడం మానుకోవాలి.
మధుమేహం:
శస్త్రచికిత్సకు ముందు 3 వారాల నుంచి లిచీలను తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే వీటిని తినడం వల్ల మధుమేహం వస్తుంది. దానిని నియంత్రించడం చాలా కష్టం. కాబట్టి లిచీని ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంది. తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ntvtelugu.com ఈ సమాచారాన్ని ధృవీకరించలేదు).
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!