Morning Walk: ఈ ఆధునిక జీవన శైలిలో నడక అనేది అందరి జీవితంలో ఒక భాగం కావాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి నడకకు ఉదయాన్ని ఉత్తమ సమయంగా చెబుతుంటారు. నిజానికి నడక శరీరంలో శక్తిని పెంచుతుంది. అలాగే ఇది గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నడక రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, కండరాలను బలపరుస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, శీతాకాలంలో తెల్లవారుజామున చల్లని గాలులలో నడవడం ఎంతవరకు సరైనది? అని. ఈ ప్రశ్నకు జవాబును ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Asia Cup Rising Stars 2025: సెమీఫైనల్లో చేతులెత్తేసిన భారత్.. ఆసియా కప్‌లో టీమిండియా ఆట ముగిసింది
శీతాకాలంలో తెల్లవారుజామున చల్లని గాలులలో నడవడం ఎంతవరకు సరైనది? ఎందుకంటే ఈ సమయంలో రక్త ప్రరసణ సాధారణం కంటే కొంచెం నెమ్మదిగా ఉంటుంది. దీంతో కొన్నిసార్లు ప్రమాదం సంభవించే ముప్పు కూడా ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు. కానీ ఉదయపు తాజా గాలి, తేలికపాటి సూర్యకాంతి విటమిన్ డి శరీరానికి అందిస్తాయి. ఇది ఎముకలకు బలాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది. కాబట్టి ఉదయం చల్లని గాలిలో నడవడం మంచి ఆలోచన కాదా అని అర్థం చేసుకోవడం ముఖ్యం. క్రమం తప్పకుండా నడవకపోతే లేదా ఏదైనా శారీరక శ్రమలో పాల్గొనకపోతే, అది శరీరంపై అనేక ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అంటున్నారు. బరువు పెరగడం, ఊబకాయం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలకు దారి తీస్తాయి. గుండె, ఊపిరితిత్తుల పనితీరు బలహీనపడుతుంది, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. కండరాల బలహీనత, కీళ్ల నొప్పులు, అలసటకు గురి కావాల్సి వస్తుంది. శారీరక శ్రమ అనేది ఒత్తిడి, నిరాశను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నడక మానేస్తే మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది.
ఉదయం చల్లటి గాలిలో నడవడం మంచిదేనా..
ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ.. ఉదయం చల్లటి గాలిలో నడవడం సాధారణంగా మంచిదని భావిస్తారు.. కానీ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. చల్లని గాలిలో నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందని, జీవక్రియ వేగవంతం అవుతుందని వెల్లడించారు. అయితే ఎవరైనా ఉబ్బసం, రక్తపోటు లేదా గుండె జబ్బులతో బాధపడుతుంటే, వారు ఉదయం చల్లటి గాలిలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వెచ్చని దుస్తులు లేకుండా నడవడం వల్ల కండరాల గాయాలు లేదా జలుబు వస్తుందని చెబుతున్నారు. ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఉదయం లేదా మధ్యాహ్నం నడవాలని, దీంతో శరీరం చురుకుగా ఉంటుందని, అలాగే జలుబు ప్రభావాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు.
ఈ జాగ్రత్తలు పాటించాలి..
చలికాలంలో ఉదయం నడక సమయంలో వెచ్చని దుస్తులు ధరించాలని వైద్యులు సూచించారు. వాతావరణం చాలా చల్లగా ఉంటే, చేతులు, కాళ్లను కప్పి ఉంచాలని, నడకను చురుగ్గా కాకుండా నెమ్మదిగా ప్రారంభించాలని చెప్పారు. చల్లని గాలి గొంతు, ఊపిరితిత్తులకు హాని కలిగించకుండా ఉంచడానికి నీరు తాగడం, అవసరమైతే మాస్క్ ధరించడం వంటివి చేయాలని అన్నారు. నడక ప్రారంభించడానికి సరైన సమయాన్ని ఎంచుకోవడం, సరైన దుస్తులను ధరించడం ముఖ్యం అన్నారు. నెమ్మదిగా నడవడం ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు వైద్యులు చెప్పారు.
READ ALSO: Smriti Mandhana Haldi: స్మృతి మంధాన ఇంట్లో పెళ్లి బాజాలు.. మొదలైన హల్దీ సెలబ్రేషన్స్