సైక్లింగ్ కూడా పర్యావరణానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని. ఈ రోజుల్లో కూడా మంది సైకిల్ తొక్కడానికి ఇష్టపడుతున్నారు. దీనిని ప్రోత్సహించడానికి ప్రపంచ సైకిల్ దినోత్సవం 2022 ను ప్రతి సంవత్సరం జూన్ 3 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వరల్డ్ సైక్లింగ్ దినోత్సవం సందర్భంగా నిర్మల్ లో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. జిల్లా అధికారులు, స్థానికులతో కలిసి ఇంద్రకరణ్ రెడ్డి 15 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కి అందర్నీ ఆశ్చర్యపరిచారు.…
ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సైకిల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరిగిపోవడంతో అందరూ సైకిళ్లను పక్కనపెట్టేసి బైకులు, కార్లనే వాడుతున్నారు. దీంతో సైకిల్ వల్ల కలిగే ప్రయోజనాలను కోల్పోతున్నారు. అందుకే 2016లో ప్రపంచ సైక్లింగ్ అలయెన్స్ (డబ్ల్యూసీఏ), ఐరోపా సైక్లిస్ట్స్ సమాఖ్య (ఈసీఎఫ్) కలిసి ప్రతి ఏడాది ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితిని కోరాయి.…