మన శరీర బరువు అధికంగా పెరగడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. నేటి బిజీ జీవితంలో ఎక్కడ పడితే అక్కడ, ఏది దొరికితే అది తినే అలవాటు వల్ల బరువు వేగంగా పెరగడం సహజం. సాధారణంగా అధిక బరువు ఉన్నవారు వెయిట్ లాస్ కోసం జిమ్‌లో గంటల తరబడి వ్యాయామం చేయడం, డైట్‌లో క్యాలరీలను లెక్కపెట్టడం వంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇవి మాత్రమే సరిపోవు. రోజువారీ ఆహారంలో దాగి ఉన్న హిడెన్ క్యాలరీ బాంబులను గుర్తించి వాటిని తగ్గించడం ద్వారా మాత్రమే నిజమైన ఫలితాలు కనిపిస్తాయి.
చాలామంది కష్టపడి వ్యాయామం చేసినా, తినే ఆహారం కారణంగా వారాలు–నెలల పాటు చేసిన శ్రమ వృథా అవుతుంది. అందుకే కొన్ని ప్రత్యేకమైన అధిక క్యాలరీల ఆహారాలను తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణగా, ఫ్రైడ్ చికెన్ మరియు ఇతర డీప్ ఫ్రైడ్ నాన్-వెజ్ స్నాక్స్‌లో రీ-యూజ్ చేసిన ఆయిల్ వల్ల ట్రాన్స్ ఫ్యాట్ పెరిగి బరువు పెరిగే ప్రమాదం అధికంగా ఉంటుంది. అలాగే 300 మిల్లీల కార్బొనేటెడ్ డ్రింక్ బాటిల్‌లోనే సుమారు 140–180 ఎంప్టీ క్యాలరీలు ఉండడం వల్ల, ఇవి రోజూ తాగితే నెలకు సుమారు 4,000–5,000 అదనపు క్యాలరీలు చేరి అర కిలో నుంచి 1 కిలో వరుకు కొవ్వు పెరగడం సహజం. ఐస్‌క్రీమ్‌లలో ఉన్న అధిక క్యాలరీలు, రిఫైన్‌డ్ షుగర్ మరియు క్రీమ్ కారణంగా ఇన్సులిన్ స్పైక్ అయి శరీరంలో కొవ్వు నిల్వ మరింత పెరుగుతుంది.
బాదం, జీడిపప్పు, పిస్తా వంటి డ్రైఫ్రూట్స్ ఆరోగ్యకరమైనవే అయినా, ఇవి క్యాలరీ డెన్స్ అయి ఉండటం వల్ల ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా పిజ్జాలో ఉన్న చీజ్‌లో అధిక సాచురేటెడ్ ఫ్యాట్ ఉండటం వల్ల సమస్యలు పెరుగుతాయి. ఒక మీడియం పిజ్జాలోని చీజ్ నుంచే 500–600 క్యాలరీలు వచ్చినట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ సమాచారం మొత్తం ఇంటర్నెట్ వనరుల ఆధారంగా సేకరించినది. కనుక ఈ సూచనలు అమలు చేసే ముందు తప్పనిసరిగా ఒక న్యూట్రిషియన్‌ను సంప్రదించడం ఉత్తమం.