Health Tips: నీరు ఎక్కువ తాగుతున్నారా.. ? అయితే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీళ్లు ఎంత తాగితే అంత మంచిది ఇది మనం ఎప్పుడు అందినోట వినే మాట. దాని వల్ల చాలా అనారోగ్యాల నుంచి బయట పడవచ్చనీ మనకు తెలుసు. కానీ, తగిన మోతాదుకు మించి నీళ్లు తాగడం అన్నది అనారోగ్యం నుంచి బయట పడొచ్చని మనందరికి తెలుసు కానీ.. మోతాదుకు మించి నీళ్లు తాగడం అన్నది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఓవర్‌హైడ్రేషన్ వల్ల శరీరం రకరకాల ఇబ్బందులకు గురి అవుతుంది.
మనిషికి జీవించేందుకు నీరు అత్యవసరం. సరైన మోతాదులో నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతులంగా ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఒత్తిడి, ఆందోళనలు దూరం అవుతాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. ముఖ్యంగా రక్తపోటు అదుపులో ఉంటుంది. మంచినీళ్లను తీసుకోవడం వల్ల ఇలా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, నీళ్లు తాగడం మంచిదన్నారు కదా అని, నిరంతరం అదే పనిలో ఉండకూడదు. అధిక మోతాదులో నీళ్లు తాగడం వల్ల చెడు పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు.
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
అతిగా నీళ్లు తాగడం వల్ల ఆ నీటిని వడబోసే శక్తిగానీ, నిల్వ ఉంచుకునే సామర్థ్యం గానీ కిడ్నీలకు ఉండదు. అప్పుడు అధికమైన ఆ నీరు రక్తంలో కలిసిపోతుంది. ఫలితంగా రక్తంలో ఉండే సోడియం సహా ఎలక్ట్రోలైట్ల శాతం తరిగిపోతుంది. శరీరంలోని ద్రవాల స్థాయిని సరిగ్గా ఉంచేవీ, ఆమ్ల క్షారాల సమతుల్యతని కాపాడేవీ ఎలక్ట్రోలైట్లే. కండరాలూ, నరాలూ సరిగ్గా పనిచేయాలంటే సోడియం ఎంతో కీలకం. కణాల లోపల నీరు ఎంత ఉండాలన్న నియంత్రణ కూడా సోడియంపైనే.
సోడియం క్షీణించడం వల్ల కణాల్లోకి నీరు చేరి అవి ఉబ్బిపోతాయి. దానివల్ల రక్తపోటు పెరుగుతుంది. హృదయ సమస్యలు వచ్చే అవకాశం అధికం అవుతుంది. తలనొప్పి, తలతిరగడం, డయేరియాలాంటి సమస్యలూ రావచ్చు. మగతగా అనిపించడం, ఒత్తిడి పెరగడం, తికమక పడటం జరగొచ్చు. అంతేకాదు అధిక మోతాదులో నీళ్లు తీసుకోవడం వల్ల మెదడు కూడా ప్రభావితం అవుతుంది. మూర్ఛ రావడం, లేదా కోమాలోకి వెళ్లడంలాంటివి కూడా జరగవచ్చు. కాబట్టి ఆరోగ్య పరిస్థితిని బట్టి కావలసినంత నీరు మాత్రమే తీసుకుంటే చెడు ప్రభావాల నుంచి దూరంగా ఉండొచ్చు.
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!