ప్రెగ్నెన్సీ కాకుండానే ట్రీట్ మెంట్.. అదేంటని అనుకోవద్దు. గర్భం వచ్చిందంటే.. పండంటి పాపాయి కోసం ఎదురుచూస్తుంది తల్లి. ఆమెతో భర్త, కుటుంబసభ్యులు.. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆదుర్దా వేరు. తొమ్మిది నెలల పాటు గర్భం వుందని చెప్పి ట్రీట్ మెంట్ ఇచ్చిందో ప్రైవేట్ ఆస్పత్రి. కాకినాడలో ఈ విచిత్రమైన ఘటన జరిగింది. ఓ మహిళకు గర్భవతి అని చెప్పి 9 నెలల పాటు తిప్పించుకుని.. తీరా ప్రసవం సమయానికి ఆస్పత్రికి వెళితే.. ఆమె గర్భవతి కాదని చెప్పారంటూ మహిళ బంధువులు ఆందోళనకు దిగారు. అసలు గర్భం లేకుండా ట్రీట్ మెంట్ ఎలా ఇచ్చారని అంతా నోరెళ్ళ బెడుతున్నారు.