Site icon NTV Telugu

Kidney Stone Risk: ఎండాకాలంలో కిడ్నీలో రాళ్ల సమస్య ఎందుకు పెరుగుతుంది? నివారణ చర్యలు..!

Kidney Stones

Kidney Stones

కిడ్నీ రాళ్లు పెట్టే బాధ అంతా ఇంతా కాదు. పొత్తి కడుపులోంచి పొడుచుకొచ్చే నొప్పి. యూరిన్‌కు వెళ్లాలంటే.. మంట. ప్రశాంతంగా కూర్చోనీయదు, హాయిగా పడుకోనీయదు. సమ్మర్‌లో కిడ్నీలో రాళ్ల సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంది. ఈ సీజన్‌లో తీవ్రమైన వేడి ప్రభావం మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. వేసవిలో కిడ్నీ స్టోన్ సమస్య ఎందుకు పెరుగుతుందో, దానిని ఎలా పరిష్కరించాలో తెలుసుకుందాం.

READ MORE: TTD: తిరుమల మెట్ల మార్గంలో మళ్లీ చిరుతల అలజడి.. నిపుణులతో టీటీడీ ఈవో భేటీ

వేసవిలో కిడ్నీ స్టోన్‌కు అతి పెద్ద కారణం ఉష్ణోగ్రత పెరగడం. ఉష్ణోగ్రత పెరగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. డీహైడ్రేషన్ ప్రభావం మూత్రపిండాలపై కూడా కనిపిస్తుంది. ఈ సీజన్‌లో కిడ్నీపై హానికరమైన ప్రభావం చూపే శీతల పానీయాలను ఎక్కువగా తీసుకుంటాం. ఇది కూడా స్టోన్స్‌కు కారణమవుతుంది. శరీరంలో నిరంతరం డీహైడ్రేషన్ సమస్య కారణంగా, కిడ్నీలో చిన్న స్ఫటికాలు ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోండి.

READ MORE: CM Revanth Reddy: భూభారతి పేద రైతులకు చుట్టం.. అవగాహన సదస్సులు నిర్వహించాలి

నివారణ చర్యలు..
వేసవిలో ఎక్కువ నీరు త్రాగాలి. తక్కువ నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కిడ్నీ స్టోన్‌ను నివారించాలనుకుంటే, జ్యూస్ తీసుకోండి. సీజనల్ పండ్లు, కూరగాయల రసం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే కిడ్నీలో రాళ్ల నుండి కాపాడుతుంది. వేసవిలో పైనాపిల్ తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా.. పైనాపిల్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. జీర్ణక్రియ కూడా బాగుంటుంది. పీచు పుష్కలంగా ఉండే పైనాపిల్ కిడ్నీ వ్యాధులను నివారిస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Exit mobile version