Kidney Stones: మూత్రపిండాల్లో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం అనేది ప్రస్తుత కాలంలో చాలా సాధారణమైన సమస్యగా మారింది. కిడ్నీలలో ఖనిజాలు (మినరల్స్) ఒకదానికొకటి అతుక్కుని చిన్న లేదా పెద్ద సైజులో ఒక్క గట్టి పదార్థంగా మారడమే కిడ్నీ స్టోన్స్. ఇవి మొదట్లో చిన్నవిగా ఉండి పెద్దవిగా మారి మూత్రనాళంలో కదలినప్పుడు తీవ్రమైన నొప్పి, మంట, మూత్ర విసర్జనలో అడ్డంకి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యకు సకాలంలో చికిత్స చేయించుకోకపోతే ఇవి కిడ్నీలకు హాని కలిగించడంతో…
కిడ్నీ రాళ్లు పెట్టే బాధ అంతా ఇంతా కాదు. పొత్తి కడుపులోంచి పొడుచుకొచ్చే నొప్పి. యూరిన్‌కు వెళ్లాలంటే.. మంట. ప్రశాంతంగా కూర్చోనీయదు, హాయిగా పడుకోనీయదు. సమ్మర్‌లో కిడ్నీలో రాళ్ల సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంది. ఈ సీజన్‌లో తీవ్రమైన వేడి ప్రభావం మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. వేసవిలో కిడ్నీ స్టోన్ సమస్య ఎందుకు పెరుగుతుందో, దానిని ఎలా పరిష్కరించాలో తెలుసుకుందాం.