ఈరోజుల్లో మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా పలరిస్తాయి.. ఉదయం నిద్ర లేవగానే వాకింగ్, వ్యాయామం చేస్తారు.. కొందరు వేడి నీటిని తీసుకోవడం మాత్రమే కాదు.. ఉదయం కొంతమంది శనగలను తీసుకుంటారు. అంతేకాదు నానబెట్టిన శనగల నీటిని తాగుతారు.. ఆ నీటిని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటుగా అనేక సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శనగలు నీళ్లలో నానబెట్టినప్పుడు లేదా ఉడకబెట్టినప్పుడు, వాటిలోని పోషకాలు కూడా నీటిలో కలిసిపోతాయి. ఈ పోషకాలు పుష్కలంగా ఉన్న నీటిని తాగడం వల్ల శరీరానికి సరిపడా పోషణ అందుతుంది.. అంతేకాదు ఈ నీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.. ఇంకా శరీరానికి అవసరమయ్యే అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి..
శనగలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగితే బరువు తగ్గుతారు. ఇది బరువు తగ్గించే మీ ప్రయత్నాన్ని మరింత సులభతరం చేస్తుంది. ఇందులో సరైన మొత్తంలో ఫైబర్ ఉంటుంది.. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది జీవక్రియను పెంచడానికి కూడా సహాయపడుతుంది..శనగలు నానబెట్టిన నీటిలో అనేక కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, వివిధ విటమిన్లు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.. శక్తిని పెంచుతుంది.. చర్మ రక్షణలో సహాయపడుతుంది…
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.