Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidney Stones Rising in Summer: వేసవి కాలం మొదలవడంతో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలో వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో పాటు కిడ్నీ రాళ్ల కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన వేడిలో శరీరం చెమట రూపంలో ఎక్కువ నీటిని కోల్పోతుంది. తగినంత నీరు తాగకపోతే మూత్రం చిక్కగా మారి, అందులోని ఖనిజాలు పేరుకుపోయి క్రమంగా రాళ్లుగా మారే ప్రమాదం పెరుగుతుంది. అందుకే వేసవిలో కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని నిపుణులు చెబుతున్నారు.
డీహైడ్రేషన్ వల్లే ప్రధాన ప్రమాదం
వైద్యుల ప్రకారం వేసవిలో కిడ్నీ రాళ్లకు ప్రధాన కారణం డీహైడ్రేషన్. అధికంగా చెమట పట్టినప్పుడు శరీరం నీటిని కోల్పోతుంది. ఈ పరిస్థితిలో కిడ్నీలు తక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. దాంతో మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్ వంటి పదార్థాల సాంద్రత పెరిగి అవి స్ఫటికాలుగా మారతాయి. ఇవే తర్వాత కిడ్నీ రాళ్లుగా మారుతాయి.
Also Read
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
ఈ ఆహారపు పొరపాట్లు ప్రమాదకరం
వేసవిలో చాలామంది చల్లని పానీయాలు, సాఫ్ట్ డ్రింక్స్, ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ ఎక్కువగా తీసుకుంటారు. అయితే అధిక సోడియం శరీరంలో కాల్షియం విసర్జనను పెంచి రాళ్లు ఏర్పడే అవకాశాన్ని పెంచుతుంది. అలాగే ఎర్ర మాంసం, అధిక చక్కెర కలిగిన పానీయాలు, తగినంత నీరు తాగకుండా ఎక్కువ వ్యాయామం చేయడం కూడా కిడ్నీ రాళ్ల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయి.
ఎలా నివారించాలి?
కిడ్నీ రాళ్లను నివారించడానికి సులభమైన మార్గం తగినంత నీరు తాగడం. రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో బయట ఎక్కువగా తిరిగేవారు ఇంకా ఎక్కువ నీరు తీసుకోవడం మంచిది. నిమ్మరసం కలిపిన నీరు కూడా ఎంతో ఉపయోగకరం. ఇందులో ఉండే సిట్రేట్ పదార్థం రాళ్లు ఏర్పడకుండా సహాయపడుతుంది.
ఆహారంలో జాగ్రత్తలు
ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, కోల్డ్ డ్రింక్స్ తగ్గించాలి. నీరు ఎక్కువగా ఉన్న పుచ్చకాయ, దోసకాయ వంటి పండ్లు తీసుకోవడం మంచిది. అయితే, మూత్రం ముదురు పసుపు రంగులో రావడం, మూత్ర విసర్జనలో మంట, నడుము నొప్పి, కడుపు పక్క భాగంలో నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా వేసవిలో చిన్న నిర్లక్ష్యమే కిడ్నీ రాళ్లకు కారణమవుతుంది. కాబట్టి తగినంత నీరు తాగడం, సరైన ఆహారం తీసుకోవడం, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు నివారించవచ్చు అని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.. అయితే, ఇది అవగాహన కోసమే.. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడ ఎంతో అవసరం..
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!