I Love My Kidneys: కిడ్నీలు దెబ్బతినకుండా ఉండాలంటే ఇవి తినకండి.. ఎక్స్‌పర్ట్ వార్నింగ్.!
- కిడ్నీలకు మొదటి శత్రువే ఎనర్జీ డ్రింక్స్
- డిటాక్స్ జ్యూస్‌లు నిజంగానే మంచివేనా?
- ఫుడ్ కలర్స్ , నమకీన్‌లలో దాగిన ప్రమాదం
- జ్యూస్‌ల బదులు పండ్లు తినడమే ఎందుకు ఉత్తమం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, మనల్ని ఆరోగ్యంగా ఉంచే కిడ్నీల పనితీరు నెమ్మదించినా లేదా దెబ్బతిన్నా అది ప్రాణాంతకమవుతుంది. అందుకే న్యూట్రిషనిస్ట్ అమితా గాడ్్రే తన కిడ్నీల మీద ఉన్న ప్రేమతో, వాటిని కాపాడుకోవడానికి తన దైనందిన ఆహారంలో కొన్ని పదార్థాలను పూర్తిగా నిలిపివేశారు. ఆ ఆరు రకాల ఆహారాలు , పానీయాలు కిడ్నీలపై ఎలా ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎనర్జీ డ్రింక్స్ , అధిక కెఫీన్
Also Read
- Homemade Oil : కల్తీకి చెక్.. ఇంట్లోనే ప్యూర్ నూనె సింపుల్‌గా ఇలా చేసుకోండి..!
- Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే 'పచ్చిమిర్చి ఆవకాయ'.! తింటే వావ్ అనాల్సిందే..
- Health Tips : గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారా? ఇంటి చిట్కాలను ఇలా ఒక సారి ట్రై చెయ్యండి.!
- Heatwave : అలసట, చిరాకు, నిద్రలేమి, ఒత్తిడి, చర్మ సమస్యలు.. ఇది ఎండాకాలం కాదు బాబోయ్.. రోగాల కాలం!
చాలామంది తక్షణ శక్తి కోసం ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు. కానీ వీటిలో కేలరీలు , కెఫీన్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. అధిక కెఫీన్ రక్తపోటును పెంచి కిడ్నీలపై భారాన్ని కలిగిస్తుంది. అందుకే అమితా గాడ్్రే వీటికి పూర్తిగా దూరంగా ఉంటారు.
డిటాక్స్ , వెజిటబుల్ జ్యూస్‌లు
విషతుల్యాలను బయటకు పంపుతాయనే పేరుతో మార్కెట్లో దొరికే డిటాక్స్ డ్రింక్స్ లేదా ప్యాక్ చేసిన వెజిటబుల్ జ్యూస్‌లకు ఆమె నో చెబుతారు. వీటిలో ఆక్సలేట్ (Oxalate) భారం ఎక్కువగా ఉంటుందని, ఇది కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుందని ఆమె హెచ్చరిస్తున్నారు. సహజంగా లభించే పండ్లు, కూరగాయలను ముక్కలుగా తినడమే శ్రేయస్కరం.
కృత్రిమ రంగులు కలిపిన ఆహారాలు
కేకులు, చికెన్ లాంటి పదార్థాల్లో ఆకర్షణ కోసం ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులను కలుపుతుంటారు. ఇటువంటి ‘ఫుడ్ కలర్స్’ కిడ్నీల వడపోత సామర్థ్యంపై ప్రభావం చూపుతాయి. కృత్రిమ రంగులు ఉన్న పదార్థాలను ఎప్పుడూ ముట్టుకోనని ఆమె స్పష్టం చేశారు.
నమకీన్ , ప్యాక్ చేసిన స్నాక్స్
చిప్స్, భుజియా, ఫర్సాన్ వంటి నమకీన్లలో ఉప్పు (సోడియం) , ట్రాన్స్ ఫ్యాట్స్ అత్యధికంగా ఉంటాయి. అధిక ఉప్పు రక్తపోటును పెంచి కిడ్నీ నాళాలను దెబ్బతీస్తుంది. గుండె , ధమనుల ఆరోగ్యం కోసం కూడా వీటిని పక్కన పెట్టడం మంచిది.
విప్డ్ క్రీమ్ (Whipped Cream)
కేకులు , డెజర్ట్‌లపై ఉండే విప్డ్ క్రీమ్ కేవలం పామ్ ఆయిల్ మాత్రమేనని అమితా గాడ్్రే పేర్కొన్నారు. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ పెంచడమే కాకుండా కిడ్నీల ఆరోగ్యానికి కూడా ఏమాత్రం మంచిది కాదు.
ఫ్రూట్ జ్యూస్‌లు
పండ్లను జ్యూస్‌లా తాగి దానిలోని పీచు పదార్థాన్ని (Fibre) వదిలేయడం కంటే, నేరుగా పండును తినడమే ఉత్తమమని ఆమె అభిప్రాయపడ్డారు. జ్యూస్‌లలో చక్కెర సాంద్రత ఎక్కువగా ఉండి, శరీరానికి అందాల్సిన పోషకాలు తగ్గిపోతాయి.
కిడ్నీల ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. పైన పేర్కొన్న పదార్థాలను నియంత్రించడం వల్ల కిడ్నీల ఆయుష్షును పెంచుకోవచ్చు. తగినంత నీరు తాగుతూ, తాజా కూరగాయలు , పండ్లను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కిడ్నీలను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
తాజావార్తలు
-
Rishab Pant: అనుకున్నదే జరిగింది.. LSG కెప్టెన్సీ నుంచి రిషభ్ పంత్ ఔట్..
-
Sergio Gor: భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతోంది.. పెట్టుబడులకు విశ్వసనీయ ప్రాంతమన్న సెర్గియా గోర్
-
Vaibhav Suryavanshi: వైభవ్‌కు మా షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ దొరికితే ఖతమే.. బుడ్డోడి ఆటకు పాక్ ఫిదా..
-
Vivo T5: వివో T5 మిడ్-రేంజ్ ఫోన్ విడుదల.. 7,200mAh భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6s Gen 2 చిప్
-
CM Revanth Reddy : ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!