Ram Charan : రామ్ చరణ్‌కు శస్త్రచికిత్స విజయవంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుడిచేతి మణికట్టు (Right Wrist) తీవ్ర సమస్యకు గురికావడంతో కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్లో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆపరేషన్ విజయవంతంగా పూర్తవడంతో మెగా అభిమానులు, సినీ లోకం ఊపిరి పీల్చుకుంది. ఈ శస్త్రచికిత్సను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఆర్థోపెడిక్ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లెజెండరీ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ నాయకత్వం వహించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి ఎదురైన అత్యంత క్లిష్టమైన వెన్నెముక సమస్యను కూడా ఈయనే విజయవంతంగా నయం చేశారు. రామ్ చరణ్ మణికట్టు సమస్యకు అత్యుత్తమ చికిత్స అందించాలనే ఉద్దేశంతో అమెరికాలోని మయామికి చెందిన ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ డాక్టర్ అలెహాండ్రో బాడియాను ప్రత్యేకంగా కోయంబత్తూరుకు రప్పించారు. సాధారణంగా స్పోర్ట్స్ ఇంజరీలు, మణికట్టు శస్త్రచికిత్సలలో నిపుణుడైన డాక్టర్ బాడియా అపాయింట్మెంట్ దొరకడమే ఎంతో అరుదు. అలాంటిది ఆయన స్వయంగా ఇండియా వచ్చి సర్జరీలో పాల్గొనడం విశేషం.
డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ అలెహాండ్రో బాడియా మరియు డాక్టర్ ప్రవీణ్ భరద్వాజలతో కూడిన నిపుణుల బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా సంతృప్తికరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరో నాలుగు రోజుల పాటు ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. కుమారుడి ఆపరేషన్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతిమణి సురేఖతో పాటు ఉపాసన కొణిదెల కోయంబత్తూరులోనే ఉండి రామ్ చరణ్‌ను దగ్గరుండి చూసుకుంటున్నారు. కాగా, డాక్టర్ రాజశేఖరన్‌తో చిరంజీవికి ఎన్నో ఏళ్లుగా మంచి ఆత్మీయ అనుబంధం ఉంది. రామ్ చరణ్ పూర్తి ఆరోగ్యంతో, త్వరగా కోలుకుని మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టి షూటింగ్లలో పాల్గొనాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
Also Read
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
- Sampoornesh Babu: 'కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ 'ది ప్యారడైజ్' కే మోగింది!'.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
- Srikanth Odela: "అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!"
తాజావార్తలు
-
Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
-
Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
-
Nani: “శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా”: నాని
-
AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?