Tata EV Discount 2025: టాటా ఎలక్ట్రిక్ కార్లపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 1.5 లక్షల డిస్కౌంట్
- టాటా ఎలక్ట్రిక్ కార్లపై బంపర్ ఆఫర్
- ఏకంగా రూ. 1.5 లక్షల డిస్కౌంట్
- ఆఫర్‌లో గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ బోనస్ ఉన్నాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంత కారు ఉండాలని కోరుకుంటున్నారా? కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కారు లవర్స్ కు బంపరాఫర్ ప్రకటించింది. టాటా మోటార్స్ ఏప్రిల్ 2025 నెలలో తన ఎలక్ట్రిక్ కార్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద కంపెనీ రూ.1.5 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్‌లో గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ బోనస్ ఉన్నాయి.
Also Read:Xiaomi QLED TV X Pro Series: గేమింగ్ మోడ్ ఫీచర్ తో షియోమీ కొత్త స్మార్ట్ టీవీ వచ్చేస్తోంది..
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
టాటా నెక్సాన్ EV
టాటా నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ SUV. దీనిపై కంపెనీ రూ.1.20 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ఆఫర్‌లో MY24, MY25 మోడల్‌లు ఉన్నాయి. దీని MY24 మోడల్‌కు రూ. 40,000 కన్స్యూమర్ ఆఫర్, రూ. 30,000 స్క్రాపేజ్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తోంది. దీనిపై టాటా EV కస్టమర్లకు రూ. 50,000, ICE కస్టమర్లకు రూ. 20,000 లాయల్టీ బోనస్ ప్రకటించింది. దాని MY25 మోడల్‌పై రూ. 30,000 ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఇస్తోంది.
Also Read:IndiGo: చిన్నారి బంగారు గొలుసు దొంగతనం.. “ఇండిగో” మహిళా సిబ్బందిపై ఆరోపణ..
టాటా పంచ్ EV
ఈ ఎలక్ట్రిక్ కారుపై రూ. 70,000 వరకు తగ్గింపు అందిస్తోంది. దీని MY24 మోడల్ పై రూ. 20,000 కన్స్యూమర్ ఆఫర్, రూ. 30,000 ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ లభిస్తోంది. దీని MY25 మోడల్‌కు రూ. 40,000 కన్స్యూమర్ ఆఫర్, రూ. 10,000 అదనపు స్క్రాపేజ్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తోంది.
Also Read:Betting : కోడ్ వర్డ్స్, సీక్రెట్ గ్రూప్స్.. బెట్టింగ్ మాఫియా కొత్త ప్లాన్
టాటా టియాగో EV
దీనిపై రూ.1.30 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నారు. దీని MY24 మోడల్‌కు రూ. 85,000 కన్స్యూమర్ ఆఫర్, రూ. 15,000 అదనపు కన్స్యూమర్ బోనస్, రూ. 30,000 స్క్రాపేజ్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ ఇవ్వబడుతున్నాయి. దీని MY25 మోడల్ రూ. 40,000 కన్స్యూమర్ ఆఫర్, రూ. 10,000 స్క్రాపేజ్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్‌ను లభిస్తోంది.
టాటా కర్వ్ EV
ఇది టాటా మోటార్స్ నుంచి వచ్చిన కొత్త, స్టైలిష్ ఎలక్ట్రిక్ కారు. 2025 ఏప్రిల్‌లో దీనిపై రూ. 1.50 లక్షల తగ్గింపును అందిస్తున్నారు. దీని MY24 మోడల్‌పై రూ. 70,000 (అన్ని వేరియంట్‌లపై) కన్స్యూమర్ ఆఫర్, రూ. 30,000 స్క్రాపేజ్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 50,000 వరకు లాయల్టీ బోనస్ అందిస్తోంది. దాని MY25 మోడల్‌పై కేవలం రూ. 30,000 ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ మాత్రమే ప్రకటించింది.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!