Bitter gourd juice: షుగర్ వ్యాధిని “కాకరకాయ” జ్యూస్ అదుపులో ఉంచుతుందా..? నిజమెంత..?
- షుగర్ నియంత్రణలో ఉండేందుకు ఉపయోగపడుతున్న కాకరకాయ..
- రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది..
- పుష్కలంగా విటమిన్స్..మినరల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bitter gourd juice: మధుమేహం, సింపుల్‌గా షుగర్ వ్యాధిగా పిలుచుకునే ఈ జబ్బు ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం భరించాల్సిందే. అయితే, కొన్ని చిట్కాలు వల్ల షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు. చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉదయం ‘‘కాకరకాయ’’ జ్యూస్ తాగుతుంటారు. అయితే, ఇది నిజంగా పనిచేస్తుందా..? అసలు ఏ విధంగా కాకరకాయ షుగర్‌ని అదుపులో ఉంచుతుందో తెలుసుకుందాం.
కాకరకాయని డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు పోషకాహార పవర్ హౌస్‌గా పిలుస్తారు. దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సాయపడుతుంది. రక్త ప్రవాహంలో చక్కెర శోషణని నెమ్మదిస్తుంది. ఫలితంగా చక్కెర రక్తంలో త్వరగా పెరగడాన్ని అడ్డుకుంటుంది. కాకరకాయ భోజనం తర్వాత గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో సాయపడుతుంది.
Also Read
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
Read Also: Mallikarjun Kharge: బీజేపీ భారత్‌ని ప్రేమించొచ్చు, కానీ పాకిస్తాన్‌ని పెళ్లి చేసుకుంది..
అంతేకాకుండా కాకరకాయలో విటమిన్ సి, పొటాషియం,మెగ్నీషియం వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఈ పోషకాలు రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తాయి, గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. మీ భోజనంలో కాకరకాయని చేర్చడం వల్ల అవరసమైన కేలరీలు, కార్బోహైడ్రెట్లు అందుతాయి.
సాధారణంగా కాకరకాయని పచ్చిగా తినడంతో పోలిస్తే జ్యూస్‌గా చేసుకుని తాగితే ఆ చేదును ఎక్కువగా గ్రహించలేదు. అందుకే ఎక్కుగా షుగర్ ఉన్నవాళ్లు జ్యూస్‌కి ప్రాధాన్యత ఇస్తారు. ఇది సులభం జీర్ణం అవ్వడంతో పాటు పోషకాలు త్వరగా గ్రహించేలా చేస్తుంది. కాకరకాయలోని ‘‘చరాన్టిన్, పాలిపెప్టైడ్-పి’’ వంటి సమ్మేళనాలు ఇన్సులిన్ తరహాలో పనిచేస్తాయి. ఇది రక్తంలో షుగర్ స్థాయిలను నిరోధిస్తుంది. దీంతో పాటు వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేలా సాయపడుతుంది. ఆక్సిడేషన్ స్ట్రేస్‌ని తగ్గిస్తుంది.
తాజావార్తలు
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!