TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC Union Elections: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల్లో ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర కార్మిక శాఖ పర్యవేక్షిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోలలో ఉదయం 5 గంటలకే ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ ప్రక్రియను సాంప్రదాయ బ్యాలెట్ పేపర్ విధానంలో నిర్వహిస్తున్నారు. మొత్తం 36,300 మంది ఆర్టీసీ కార్మికులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ప్రతీ కార్మికుడు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘానికి, మరొకటి రీజియన్ స్థాయి గుర్తింపు సంఘానికి. దూర ప్రాంతాల్లో డిప్యూటేషన్‌పై సర్వీసులో ఉండే ఉద్యోగుల సౌకర్యార్థం ఈ నెల 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ సదుపాయం కల్పించారు. పోలింగ్ సమయానికి ముందు ఇరు ప్రధాన కూటముల ప్రచారం హోరాహోరీగా సాగింది. EU – TMU – NMU కూటమి ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తుండగా, TWU – SWU – SWF కూటమి తాము భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నామని ధీమాగా ప్రకటిస్తున్నాయి. పోలింగ్ ముగిసిన అనంతరం, ఈ నెల 17న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి కార్మిక శాఖ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనుంది.
Also Read
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!