ఈరోజుల్లో మనం తీసుకొనే ఆహారం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడంతో పాటుగా రక్తం శాతం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఒంట్లో సరిగ్గా రక్తం లేక ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో చాలామంది ఒంట్లో రక్తంని పెంచుకోవడం కోసం రకరకాల మెడిసిన్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు.. ముఖ్యంగా మహిళలకు రక్తం చాలా అవసరం.. మన ఇంట్లో వంటింటి చిట్కాలతో ఒంట్లో రక్తాన్ని అమాంతం పెంచుకోవచ్చు.. ఆ జ్యూస్ ను రోజూ తాగితే రక్తాన్ని పెంచుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.. ఆ జ్యుస్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఒంట్లో రక్తం పెరగాలంటే మన ఆహారంలో ఖచ్చితంగా ఐరన్ ఎక్కువగా ఉండాలి. మహిళలకు ప్రతి రోజు 30 గ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. పురుషులకు అయితే రోజూ 28 గ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. తినే ఆహారంలో ప్రతిరోజూ ఎక్కువ ఐరన్ ఉండేలా చూసుకోవాలి.. రక్తంలో ఐరన్ శాతం వెంటనే పెరగాలంటే క్యారెట్ జ్యూస్ ను తాగాల్సిందే..
షుగర్ లాంటి సమస్యలు లేని వాళ్లు అయితే క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ తాగవచ్చు. ఉదయం పూట రెండు క్యారెట్లు, బీట్ రూట్, టమాట, కీర దోశతో కూడా జ్యూస్ చేసుకొని తాగవచ్చు. ఆ జ్యూస్ లో ఎండు ఖర్జూరం పొడి, తేనె కలుపుకొని తాగితే చాలు.. అంతేకాదు గోధుమ గడ్డిని కూడా కలుపుకొని తాగడం వల్ల రక్తం వెంటనే పెరుగుతుంది.. బత్తాయి జ్యూస్ కానీ కమలం జ్యూస్ అయినా ఏదైనా పండ్ల జ్యూస్ తాగవచ్చు. లేదంటే ఒక గ్లాస్ చెరుకు రసం తాగినా చాలు.. రక్తం అమాంతం పెరుగుతుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.