చలికాలంలో సీజనల్ వ్యాధులు రావడం కామన్ అందుకే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల వాటి నుంచి బయట పడవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది. దీన్ని తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. దాని వేడి స్వభావం కారణంగా ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. చలికాలంలో ఖర్జూరాలు చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఐరన్, కాల్షియం, మినరల్స్, ఫాస్పరస్, అమినో యాసిడ్స్ వంటివి చెయ్యడం వీటిలో అధికంగా ఉంటాయి.. ఇంకా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఖర్జూరం తింటే జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి. నిజానికి చలికాలంలో జలుబు, దగ్గు రావడం సర్వసాధారణం అయితే రోజూ 2-3 ఖర్జూరాలను పాలలో కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు..
జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రజలు తరచుగా మలబద్ధకం గురించి ఫిర్యాదు చేస్తారు. ఇందులో తగినంత మొత్తంలో పీచు లభిస్తుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేసి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది..
ఈ కాలంలో మోకాళ్ల నొప్పులు పెరుగుతాయి. ఖర్జూరాన్ని రోజూ తీసుకోవడం వల్ల కొంత ప్రయోజనం పొందవచ్చు. ఖర్జూరంలో క్యాల్షియం, సెలీనియం, మాంగనీస్ మొదలైన పోషకాలు ఉంటాయి.. అంతేకాదు ఎముకలను దృడంగా ఉంచేందుకు సహాయ పడుతుంది..
ఇకపోతే బరువు పెరగకపోతే శీతాకాలంలో ప్రతిరోజూ ఖర్జూరం తినడం ప్రారంభించండి. ఇది మీ బరువు వేగంగా పెరిగేలా చేస్తుంది.. ఇంకా చర్మ సమస్యలను కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇంకా ఎన్నో రోగాలను నయం చేస్తుందని చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.