చలికాలంలో వచ్చేసింది.. రోజు రోజుకు వేడి తగ్గిపోతుంది.. చలిపులి వణికిస్తుంది.చలికాలంలో అనారోగ్య సమస్యలు, ఇన్పెక్షన్ లు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి.. చలినుండి రక్షణ పొందడానికి టీ, కాపీలను తాగుతూ ఉంటారు. అయితే వీటికి బదులుగా కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిని తాగడం వల్ల చలి నుండి ఉపశమనం కలగడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం..
ఈ కషాయాన్ని ఎలా తయారు చెయ్యడానికి అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క,పుదీనా ఆకులు లేదా తులసి ఆకులు, బెల్లం, పసుపును వాడాల్సి ఉంటుంది.. ఈ కషాయాన్ని ఎలా తయారు చెయ్యాలంటే.. ముందుగా ఒక జార్ లో అల్లం ముక్కలు, వాము, మిరియాలు, దాల్చిన చెక్క, పుదీనా ఆకులు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని గిన్నెలో వేసి అందులో నీళ్లు పోయాలి. తరువాత ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి నీరు మరిగి వరకు ఉంచాలి. నీరు మరిగిన తరువాత మరో రరెండు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ నీటిలో బెల్లం, పసుపు వేసి కలపాలి. బెల్లం కరిగిన తరువాత వడకట్టి కప్పులో పోసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కషాయం తయారవుతుంది.. ఈ కషాయాన్ని గోరు వెచ్చగా తాగడం వల్ల చాలా మంచిది..
ఈ కషాయాన్ని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం..
ఈ కషాయాన్ని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది..జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ఇన్పెక్షన్ లు దరి చేరకుండా ఉంటాయి. బరువు తగ్గవచ్చు. శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఈ కషాయాన్ని తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా దీనిని తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ఉదరసమస్యలు కూడా తొలగిపోతాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.