Curry Leaves Benefits: నిజానికి ఇది ఆకు మాత్రమే కాదని అమృతం అని అంటున్నారు పలువురు వైద్య నిపుణులు. ఎందుకంటే ఈ ఆకులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆకు ఏంటో తెలుసా.. కరివేపాకు. ఇది కేవలం ఒక రుచికరమైన ఆకు మాత్రమే కాదని దీనిలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విశేషంగా సహాయపడతాయని వెల్లడించారు. ఈ కరివేపాకు కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Akhanda2: రెగ్యులర్ షోల బుకింగ్స్ ఓపెన్.. ప్రీమియర్ బుకింగ్స్ ఎప్పుడు అంటే!
కరివేపాకు గుండె నుంచి మెదడు, క్యాన్సర్ వ్యాధి రాకుండా కాపాడే వరకు అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి అధిక ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. కానీ కరివేపాతో ఈ గుండె ప్రమాదాన్ని తగ్గించవచ్చని వైద్యులు తెలిపారు. జంతువులపై నిర్వహించిన పరిశోధనలో కరివేపాకు సారం పెరిగిన ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని తేలింది.
వ్యాధులను నివారిస్తుంది..
కరివేపాకు నాడీ వ్యవస్థ, అంటే మెదడు, నరాలు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అల్జీమర్స్ అనేది ఆక్సీకరణ ఒత్తిడి, నాడీ నష్టంతో కూడిన మెదడు వ్యాధి. కరివేపాకులో అల్జీమర్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడే సమ్మేళనాలు ఉన్నాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే కరివేపాకులో బలమైన క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగిన సమ్మేళనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మలేషియాలో నిర్వహించిన అధ్యయనాలు కరివేపాకు రొమ్ము క్యాన్సర్ వ్యాప్తిని నివారించడంలో సహాయపడతాయని గుర్తించారు. ఒక జంతు అధ్యయనంలో.. కరివేపాకు రసం నోటి ద్వారా ఇచ్చినప్పుడు అది కణితి పెరుగుదలను తగ్గించడంలో, క్యాన్సర్ కణాలు ఊపిరితిత్తులకు వ్యాపించకుండా నిరోధించడంలో సహాయపడిందని వెల్లడైనట్లు తెలిపారు.
అనేక పరిశోధనలలో కరివేపాకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు వెల్లడైనప్పటికీ, దానిని ఔషధంగా కాకుండా ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. కరివేపాకులను ఆహారంలో ఎలా చేర్చుకోవాలంటే రోజూ 4-5 కరివేపాకులను నమలడం ద్వారా లేదా నీటిలో మరిగించి తాగడం, లేదంటే పప్పులు, కూరగాయలు లేదా సూప్‌లలో చేర్చడం ద్వారా ఆహారంలో భాగం చేసుకోవచ్చని నిపుణులు వెల్లడించారు.
READ ALSO: Akhanda2 Release Teaser: ఎవర్రా నిప్పుల కొండను ఆపేది..! అఖండ 2 కొత్త టీజర్ చూశారా..