Health Benefits of Guava: జామపండ్లతో ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలిస్తే .. అస్సలు వదిలిపెట్టరు.
- జామపండ్లలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది
- జీర్ణక్రియ మెరుగుపరిచే శక్తి ఉంటుంది
- మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పండ్లలో ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడంతో మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే జామపండ్లలో పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని న్యూట్రియన్స్ చెబుతున్నారు. వీటి ప్రయోజనాల గురించి తెలుసుకుంటే అస్సలు వదిలిపెట్టరు. ముఖ్యంగా డైటరీ ఫైబర్, విటమిన్ C పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.
జామపండ్లలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపరిచే శక్తి ఉంటుంది. ముఖ్యంగా తొక్కతో తింటే మరింత ప్రయోజనమని న్యూట్రిషియన్స్ చెబుతున్నారు. ఫైబర్ పేగు కదలికలను మెరుగుపరచి మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది.జామలో ఉండే విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది
Also Read
- Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
దీంతో ఇమ్యూనిటీ పెరిగి వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండగలం. అలాగే..జామలోని ఫైబర్ కారణంగా రక్తంలో గ్లూకోస్ ఒక్కసారిగా పెరగకుండా ఉంటుంది. షుగర్ స్థాయి నెమ్మదిగా పెరుగుతుంది. దీంతో డయాబెటిస్ నియంత్రణలో సహాయం చేస్తుంది. డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జామలో ఉండే పొటాషియం, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతాయి. అందువల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనిలో ఫైబర్ ఎక్కువ ఉండడంతో..ఇవి కడుపు నిండిన భావన కలిగించడంతో ఆకలి తగ్గి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
జామపండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్, టానిన్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్నాయి.
ఇవి కీళ్లలో మంట, వాపు తగ్గించడంలో సహాయపడుతూ ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జామలోని ముఖ్యమైన పోషకాలు కంటికి అవసరమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. వయసుతో వచ్చే కంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. జామపండ్లలో ఉన్న విటమిన్ C, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో చర్మం ఆరోగ్యవంతంగా, మెరిసేలా మారుతుంది.రోజుకు ఒక జామ తింటే యవ్వనంగా కనిపించేందుకు సహాయపడుతుంది. జామలో ఉండే పాలీఫినాల్స్, యాంటీ మైక్రోబియల్ గుణాలు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. ముఖ్యంగా పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
తాజావార్తలు
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!