పండ్లలో ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడంతో మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే జామపండ్లలో పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని న్యూట్రియన్స్ చెబుతున్నారు. వీటి ప్రయోజనాల గురించి తెలుసుకుంటే అస్సలు వదిలిపెట్టరు. ముఖ్యంగా డైటరీ ఫైబర్, విటమిన్ C పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. జామపండ్లలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపరిచే శక్తి ఉంటుంది. ముఖ్యంగా తొక్కతో తింటే మరింత ప్రయోజనమని న్యూట్రిషియన్స్ చెబుతున్నారు.…