మనిషి శరీరంలోని ముఖ్య భాగాల్లో గుండె ఒకటి. సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కొన్ని లక్షణాల ద్వారా గుండె సమస్యల్ని ముందుగానే కనుక్కునే అవకాశం ఉంది. ఉబ్బిన పాదాలు మీ గుండెపై శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తాయంటున్నారు వైద్యులు, సరిగ్గా చెప్పాలంటే మడమకి ఎలాంటి నొప్పి లేకుండానే ఉబ్బినట్లుగా ఉంటే తేలిగ్గా తీసుకోవద్దు.. అదే విధంగా వాచిన ప్రాంతం కాస్తా వేడిగా మారుతుంది. ఆ వాపు ఉన్న ప్రాంతంలో నొక్కితే చర్మం సొట్టలా పడుతుంది. పరిస్థితి ఎక్కువ సమయం ఇలానే ఉంటే కచ్చితంగా వైద్యులని సంప్రదించాలి.ఇలాంటి సమస్యని పెరిఫెరల్ ఎడెమా అంటారు. కణజాలంలో ద్రవం చేరినప్పుడు ఇది వస్తుంది. ఎక్కువగా చేతులు, కాళ్ళకి వస్తుంది. ఈ సమయంలో చేతులు, కాళ్ళు బరువుగా మారుతుంటాయి,
కాళ్ళలోకి నీరు చేరి సమస్యగా అనిపిస్తుంది. ఇది గుండెజబ్బులు రావడానికి ముందు లక్షణం అంటున్నారు వైద్యుల, ఇది అలెర్జీ కారణంగా కూడా వస్తుంది ఒక్కోసారి.ఈ సమస్య ఉన్నప్పుడు పాదాల్లో వాపు మాత్రమే కాకుండా, చేతులు, ముఖం ఉబ్బినట్లుగా ఉంటాయి. ఎక్కువసేపు నిలబడినా, కూర్చున్నా వాపు వచ్చేస్తుంది. కొన్ని సార్లు రోగికి మెడనొప్పి కూడా ఉంటుంది.పెరిఫెరల్ ఎడెమా వల్ల గుండెకి రక్త సరఫరా తగ్గినప్పుడు గుండెపై వత్తిడి పెరుగుతుంది. గుండె పంప్ చేసే రక్తాన్ని బలహీనపరిచినప్పుడు అది తీవ్రంగా మారుతుంది. గుండె జబ్బుకూడా వచ్చే ప్రమాదం ఉంది. దగ్గు, ఆగకుండా వస్తూంటే, గురక, కడుపులో ఉబ్బరంగా ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. బరువులో తేడా వచ్చినా, మనసులో ఆందోళన ఎక్కువగా ఉన్నా పెరిపెరల్ ఎడెమా ప్రభావం చూపుతుందని గ్రహించాలి.
Read Also: K.Veeramani: మరోసారి బీసీలు యుద్ధానికి రెడీ కావాలి
పెరిఫెరల్ ఎడెమాతో సంబంధం ఉన్న ఇతర జబ్బుల విషయానికొస్తే వెరికోస్ వీన్స్, డీప్ వీన్ త్రంబోసిస్, కిడ్నీ సమస్యలు, రక్తంలో ప్రోటీన్ తగ్గడం, లివర్ సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ పెరిఫెరల్ ఎడెమా ఎంఫిసెమా అనే ఊపిరితిత్తుల సమస్యకి కూడా కారణం అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. గుండె జబ్బులు అనేవి అకస్మా్త్తుగా రావు. శరీరంలో కొన్ని లక్షణాలు ద్వారా ముందుగానే ఇండికేషన్ ఇస్తాయి. ఈ సమస్యలను ఎప్పుడు కూడా పట్టించుకోకుండా ఉండకూడదు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, సరైన ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్ గుండె పనితీరు మెరుగవుతుంది.
ఎడెమా ఎవరికైనా సంభవించవచ్చు మరియు వివిధ కారణాల వల్ల సీనియర్ సిటిజన్లలో ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా పల్మనరీ ఎడెమా, సెరెబ్రల్ ఎడెమా, మాలిక్యులర్ ఎడెమా, లింఫెడెమా, పెడల్ ఎడెమా, లెగ్ ఎడెమా.. ఈ కాళ్ళలో ఎడెమా ఉంటే మీ కాళ్లు బరువుగా మారవచ్చు, ఇది నడవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో, ఇది పూతలకి దారితీసే రక్త ప్రవాహానికి అంతరాయం కలిగించవచ్చు. గుండెపై భారం పెంచవచ్చు. ఎడెమా లక్షణాలను గుర్తిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించి వైద్యం తీసుకోవాలి.
Read Also: YVLN Shastri: సినీ రచయిత, సెన్సార్ బోర్డ్ మెంబర్ యడవల్లి కన్నుమూత!
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.