మరోసారి బీసీలు తమ హక్కుల సాధనకు, ఆత్మగౌరవం కోసం యుద్ధానికి సిద్ధం కావాలన్నారు డీకే పార్టీ అధ్యక్షుడు వీరమణి. బీసీ సామాజిక వర్గం అనుభవిస్తున్న 27 శాతం రిజర్వేషన్ లు బీపీ మండల్ వల్లే సాధ్యం అయ్యాయి. బీసీ కమిషన్ రికమండేషన్ పార్లమెంట్ గడప దాటకుండా అనేక శక్తులు అడ్డుకున్నాయి.. మండల్ కమిషన్ రిపోర్ట్ బుట్టదాఖలు అవకుండా అనేక పోరాటాలు జరిగాయి. బ్రాహ్మణుల చేతిలో ఉన్న ప్రసార మాధ్యమాలు బీసీల కష్టాలు బయటకు రానీయలేదన్నారు వీరమణి. అగ్రకులాల ఆధిక్యతతో కుయుక్తులు పన్ని 50 శాతానికి రిజర్వేషన్ లు మించకుండా ముందరి కాళ్ళకు బంధాలు వేశారన్నారు.
Read Also: YVLN Shastri: సినీ రచయిత, సెన్సార్ బోర్డ్ మెంబర్ యడవల్లి కన్నుమూత!
52 శాతం ఉన్న బీసీ లకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. పేరుకు 27 శాతం ఉన్నా , బీసీ లకు కేవలం 10 శాతం మాత్రమే రిజర్వేషన్ లు అందుతున్నాయి. ప్రభుత్వ సంస్థల ను ప్రైవేటీకరణ చేయడంతో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల కు రిజర్వేషన్ లు అందటం లేదు. బీసీల ఆత్మ గౌరవం కోసం మండల్ ప్రాణాలు అర్పించారు. మండల్ స్ఫూర్తి తో హక్కుల సాధనకు మరోసారి బీసీ లు యుద్ధం ప్రారంభించాలన్నారు డీకే పార్టీ అధ్యక్షుడు వీరమణి. ఏపీ మంత్రి విడదల రజినీ మాట్లాడుతూ… బీసీలంటే గతంలో గుర్తింపు ఉండేది కాదు. ఇప్పుడు గణనీయమైన మార్పు వచ్చింది. రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీలదే. ఓట్లు సమయంలో బీసీలు గుర్తొచ్చేవారు.. జగన్ ప్రభుత్వం వచ్చాక బీసీలకు పెద్దపీట వేశారు. బీసీల జనగణనపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం అన్నారు మంత్రి రజని.
Read Also: Kondagattu: యాదాద్రి తరహాలో కొండగట్టు అభివృద్ధి