health: ఒకప్పుడు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి షుగర్, బిపి లు వచ్చేవి. కానీ ప్రస్తుతం 25 సంవత్సరాల నుండే షుగర్, బిపిల బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మారిన జీవన శైలి.. కలితీ అయిన ఆహారం. దీనితో మనిషి ఆరోగ్యం రోజు రోజుకి దెబ్బతింటుంది. అయితే ప్రస్తుతం చాలా మంది ఎదుర్కుంటున్న సమస్య డైయాబెటిస్. అంగట్లో అన్ని ఉన్న అల్లడు నోట్లో శని అన్నట్లు ఉంటుంది డైయాబెటిస్ వాళ్ళ పరిస్థితి. ఏది తిన్న షుగర్ లెవెల్స్ పెరుగుతాయేమో అని భయపడుతూ ఉంటారు. అందుకని డైట్ చేస్తారు దీనివల్ల నీరసం వస్తుంది.
Read also:Miracle Drug: అద్భుత ఔషధంతో క్యాన్సర్‌ని జయించిన మహిళ..
అయితే ఈ ఆహార పదార్ధాలు తీసుకుంటే మీరు మీ షుగర్ ని నియంత్రణలో ఉంచుకోగలరు. అలానే నీరరసం అనే మాట మీ ధరి చేరదు. మరి ఆ ఆహార పధార్దాలేంటో ఇప్పుడు చూదాం.. బ్రోకలీ, బచ్చలికూర, గ్రీన్ బీన్స్, క్యాబేజి, మునగఆకు, చింత చిగురు వండి ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో కార్బోహైడ్రేట్స్ ఉండవు. ఉదయాన్నే అల్పాహారంగా ఓ గ్లాస్ బూడిద గుమ్మడి కాయ జ్యూస్, 4 నుండి 6 నానబెట్టి పొక్కు తీసిన బాదం గింజలు, అలానే ఓ ఉడకబెట్టిన గుడ్డు (గుడ్డు లోని పచ్చ సొన లేకుండా) తీసుకోవాలి. అలానే మధ్యాహ్నం మీల్స్ గా గ్రీన్ సలాడ్ అంటే కూరగాయల్ని కడిగి ముక్కలుగా చేసి వాటిని వేడి నీళ్లలో ఓ పదినిమిషాలు ఉంచి, ఆ తరువాత తీసి చిటికెడు ఉప్పు మిరియాల పొడి, నిమ్మ రసం కలిపి తీసుకోవాలి. రాత్రి భోజనానికి ఓ చపాతీ ఒక గిన్నెడు కూర తీసుకోవాలి. మీకు మధ్యలో ఏదైనా తినాలి అనిపిస్తే మొలకెత్తిన గింజలు, అలానే చిరుధాన్యాలతో చేసిన స్నాక్స్ తీసుకోవచ్చు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.