Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Puri: సాధారణంగా పూరీ అంటేనే ఆయిలీ ఫుడ్ అని, అన్-హెల్తీ అని చాలా మంది దూరంగా ఉంటారు. కానీ అదే పూరీని ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిరుధాన్యాలతో చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అద్భుతమైన రుచితో పాటు బోలెడంత ఆరోగ్యాన్ని ఇచ్చే ‘రాగి పూరీ’ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. రాగి పిండితో చేసినా కూడా పూరీ పూరీలాగే చక్కగా పొంగుతూ, దూదిలా మెత్తగా రావాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. దానికి తోడు నోరూరించే బొంబాయి చట్నీ ఉంటే ఆ మజానే వేరు. ఈ హెల్తీ రెసిపీని ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రాగి పూరీ తయారీ విధానం..
రాగి పూరీలు నల్లగా రాకుండా, సాఫ్ట్‌గా రావడానికి రాగి పిండితో పాటు కొద్దిగా గోధుమ పిండిని కూడా కలపాలి. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు గోధుమ పిండి, తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. రాగి పిండి జిగురు తక్కువగా ఉంటుంది కాబట్టి, పిండిని కలిపేటప్పుడు గోరువెచ్చని నీటిని వాడితే పూరీలు విరిగిపోకుండా మెత్తగా వస్తాయి. తర్వాత ఆ పిండిని అరగంట పాటు నానబెట్టిన తర్వాత, చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత వేయిస్తే పూరీలు చక్కగా పొంగుతాయి.
Also Read
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
కాంబినేషన్ ‘బొంబాయి చట్నీ’..
రాగి పూరీలకు బెస్ట్ కాంబినేషన్ బొంబాయి చట్నీ. ముందుగా ఒక బాణలిలో నూనె వేసి తాలింపు గింజలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత ఒక గిన్నెలో రెండు స్పూన్ల శనగపిండిని నీళ్లలో ఉండలు లేకుండా కలిపి, వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేయాలి. తగినంత ఉప్పు, పసుపు వేసి చిక్కబడే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అంతే మన బొంబాయి చట్నీ కంప్లీట్ అయిపోతుంది.
ప్రయోజనాలు ఇవే..
చిరుధాన్యాలన్నింటిలో రాగులలో క్యాల్షియం అత్యధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడమే కాకుండా, చిన్న పిల్లల్లో ఎముకల పెరుగుదలకు, వృద్ధుల్లో వచ్చే ఆస్టియోపోరోసిస్ (ఎముకల బలహీనత) సమస్యను నివారించడానికి తోడ్పడుతుంది. రాగులలో ఐరన్ (ఇనుము) సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు రాగిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. గోధుమ లేదా మైదా పిండితో పోలిస్తే రాగులలో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు. చక్కెర వ్యాధి ఉన్నవారికి ఇది మంచి అల్పాహారంగా పని చేస్తుంది.
రాగులలో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఈ పూరీలు తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపించి, ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఇది అతిగా తినడాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే రాగులలో ఉండే అమైనో యాసిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతాయి. దీంట్లో అధిక పీచు పదార్థం ఉండటం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోయి, జీర్ణవ్యవస్థ సాఫీగా సాగుతుంది. వెరైటీ, హెల్తీ వంటకాల కోసం ప్రయత్నించే వారు ఈ రాగి పూరీలను తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!