Health: మనం తినే పండ్లు గానీ, కూరగాయలు గానీ ఫ్రెష్ గా నీటిలో కడుక్కొని తింటాం. తినేముందు వాటిపై ఉన్న తొక్కలను వేరు చేసి లోపల ఉన్న పదార్థాన్ని తింటాం. అయితే తినే పండులోపల కన్నా.. తొక్కతోనే ఎక్కువ లాభాలున్నాయంటున్నారు. నిజానికి ఈ తొక్కల్లోనే మానవుడికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి తెలుసా..? కొందరు తెలిసిన వారు తొక్కలు కూడా తింటారు. అందులో ఉన్న విటమిన్స్ వారికి తెలుసు కాబట్టి వాటిని పడేయకుండా నమిలేస్తారు. మరికొందరేమో తెలిసి కూడా తినరు ఎందుకంటే అవి తినడం ద్వారా.. కడుపు లోపల జీర్ణం కాదని పక్కన పెట్టేస్తారు.
Read Also: KA Paul: వాళ్లందరు నా పార్టీలోకే.. కేఏ పాల్ హాట్ కామెంట్స్!
తొక్కల వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని కొందరు నిపుణులు చెబుతున్నారు. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, కూరగాయలతో పాటు వాటికున్న తొక్కలను కూడా తినాలి. ఎందుకంటే తొక్కల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు మన శరీరంలో పోషకాల పరిమాణాన్ని కాపాడుతాయి. తొక్కలను తీసేయడం వలన బాడీలో పోషకాలు తగ్గుతాయి. దోసకాయ, టమోటాలు, ఆపిల్, ద్రాక్ష, పియర్స్ వంటి పండ్లు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటితో పాటుగా వీటి తొక్కలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.
Read Also: David Warner: వార్నర్ సంచలన ప్రకటన.. 2024లో గుడ్‌బై
మనం ఏ పండ్లు, కూరగాయల తొక్కలు తింటే సులభంగా జీర్ణమవుతాయో తెలుసుకుందాం. ఆపిల్, చెర్రీలు, బెర్రీలు, ద్రాక్ష పండ్లు, పీచెస్, ప్లమ్స్, దోసకాయలు, వంకాయలు, బఠానీలు, టమోటాలు, బంగాళాదుంపలు, దోసకాయలు, గుమ్మడికాయ తొక్కలు చాలా సులువుగా జీర్ణమవుతాయి. పుచ్చకాయ, ఖర్బూజా, మామిడి, అవొకాడో, ఉల్లిపాయ, లిచీ, పైన్ ఆపిల్, బొప్పాయి, బీట్ రూట్, నిమ్మ, నారింజ, జాక్ ఫ్రూట్ తొక్కలు అంత తొందరగా జీర్ణం కావు.