ఉసిరికాయల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. జుట్టు నుంచి కాళ్ళ వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..అయితే ఈ కాయలు ఒక్క చలికాలంలో ఎక్కువగా లభిస్తాయి..అప్పుడే ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది. అయితే ఈ కాయలను ఎండబెట్టి అమ్ముతారు.. వాటిని తీసుకున్నా కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ప్రయోజనాలు ఏంటో.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఎండబెట్టిన ఉసిరి ముక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిల్లో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ మాదిరిగా పనిచేస్తుంది. ఇది ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. దీంతో కణజాలం సురక్షితంగా ఉంటుంది. ఎండిన ఉసిరికాయల్లో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతుంది. దీని వల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది..దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు రావు. ఎండిన ఉసిరి ముక్కలను తినడం వల్ల జీర్ణశక్తి మెరుగు పడుతుంది.. జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు ఆకలిని వేసేలా చేస్తుంది..
ఇకపోతే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని, వాపులను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు రావు. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఎండిన ఉసిరి ముక్కలను రోజూ తినడం వల్ల వయస్సు మీద పడడం కారణంగా వచ్చే ఆందోళన, వణుకు, మతిమరుపు వంటి సమస్యలు దూరం అవుతాయి.. అందుకే వీటిని తెచ్చుకొని రోజుకు 3 నుంచి 4 తింటే మంచి ఫలితాలు ఉంటాయి.. ఎన్నో సమస్యలు నయం అవుతాయి.. పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి వారికి కూడా ఇవ్వండి.. ఒక్క ఎండువి మాత్రమే కాదు.. జామూన్ కూడా తీసుకోవడం వల్ల మంచిది ఫలితాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..