Effect on Ears: ఎవరితోనైనా మనం మాట్లాడుతుంటే తనకు సరిగా వినబడకపోతే ఏంటీ? ఏంటీ? అని అడిగినపుడు మనం వీడేంటి సౌండ్ ఇంజనీర్‌లాగా ఉన్నాడు అనుకుంటాం. సౌండ్ ఇంజనీర్ అంటే చెవులు వినబడని(బధిరుడు) అనుకుంటాం. చెప్పింది వినబడలేదని ఎదుటి వారు అడిగితే ఎన్నిసార్లు చెప్పాలి.. సౌండ్ ఇంజనీర్‌లాగా ఉన్నావే అని కసురుకుంటాం.. ఇపుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలోకి సెల్‌ఫోన్ వచ్చింది. కొందరి దగ్గరైతే రెండు, మూడు సెల్‌ఫోన్లు కూడా కనబడతాయి. ఇక ఫోన్ వాడకంలో ఎవరైనా ఫోన్ చేసినపుడు వారితో మాట్లాడాలి అనుకుంటే.. ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే ఇయర్ ఫోన్ పెట్టుకొని మాట్లాడాలి. ఇక అసలు విషయానికొస్తే.. ఇయర్ ఫోన్స్.. ఇయర్‌బడ్స్ ఎక్కువ సేపు వాడితే.. మీరు సౌండ్ ఇంజనీర్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సెల్‌ఫోన్ మానవ జీవితంలో భాగమైపోయింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ మొబైల్ ఫోన్‌ను వాడుతున్నారు. అయితే సెల్‌ఫోన్ ఉన్న వారిలో 70 శాతం మంది ఇప్పుడు ఇయర్‌ఫోన్లు, ఇయర్ బడ్‌లను వాడుతున్నారు. ముఖ్యంగా యువత వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నది. మ్యూజిక్, పాడ్‌కాస్ట్‌లు, యూట్యూబ్ వీడియోల కోసం ఇయర్ ఫోన్ల వాడకం తప్పనిసరిగా మారింది. అయితే మితిమీరి వాటిని ఉపయోగించడం వల్ల వినికిడి శక్తి తగ్గడమే కాక .. చెవుడు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా చెవికి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటున్నారు. అలా యూపీలోని గోరఖ్‌పూర్‌కు చెందిన 18 ఏండ్ల ఒక యువకుడు వినికిడి శక్తిని కోల్పోగా ఢిల్లీకి చెందిన డాక్టర్లు అతడికి ఆపరేషన్ చేసి వినికిడి శక్తిని పునరుద్ధరించారు. ఇయర్ ఫోన్లను అధికంగా వాడటం వల్ల చెవిలో ఇన్‌ఫెక్షన్ ఏర్పడి ఈ పరిస్థితి వచ్చినట్టు ఆపరేషన్ చేసిన వైద్యులు తెలిపారు. టీనేజర్లలో సౌండ్ మాస్టర్ కేసులు అధికంగా నమోదవుతున్నట్టు వారు చెబుతున్నారు.
Add also: Illicit relationship: ఫ్రెండ్ భార్యతో ఎస్కేప్.. టెన్షన్ పడకు నాఫ్రెండ్‌కు తెలుసంటూ భార్యకు లేఖ
ఎక్కువ సేపు ఇయర్ ఫోన్లు, బడ్లు వాడకం వల్ల కర్ణములోని నాళంలో తేమ పెరుగుతుందని.. క్రమంగా అక్కడ బ్యాక్టీరియా, వైరస్‌లు అభివృద్ధి చెందుతాయని డాక్టర్లు చెబుతున్నారు. బ్యాక్టీరియా వల్ల చెవిటితనం వస్తుందంటున్నారు. చాలా సేపు ఇయర్ ఫోన్లు వాడటం వల్ల చెవిలోకి గాలి, వెలుతురు వెళ్లే మార్గం మూసుకుపోవడంతో చెమట, ఇతర కారణాలతో తేమ పెరిగి ఇన్‌ఫెక్షన్ ఏర్పడుతుందని డాక్టర్లు తెలిపారు. ఇయర్‌ఫోన్‌ను తప్పనిసరిగా వాడాల్సి వస్తే కొన్ని జాగ్రత్తలను పాటించాలని డాక్టర్లు కొన్ని సూచనలు చేస్తున్నారు. మీ ఇయర్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో మరొకరికి షేర్ చేయవద్దు. ఎందుకంటే మనం వాడే ఇయర్ ఫోన్ల నుంచి వైరస్ ఇతరులకు సోకుతుంది. లేదా వారి నుంచి మనకు వస్తుంది. మీరు మామూలుగా కానీ, విధి నిర్వహణలో కానీ ఇయర్ ఫోన్లను వాడుతున్నట్టయితే కొద్ది సేపు విరామమివ్వాలని సూచిస్తున్నారు. కార్యాలయ అవసరాలలో వీటి వాడకం తప్పనిసరైతే సాధ్యమైనంత వరకు తక్కువ సౌండ్ పెట్టుకోవాలి.. వాడలేనప్పుడు చెవి నుంచి బయటకు తీసి ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. మనం వాడుతున్న బడ్లను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి.. అలాగే చెవి నాళాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
Mani sharma : కొడుకు చేసిన పనికి షాక్ కి గురయిన మణిశర్మ..!!