చిత్ర పరిశ్రమలో ఎన్నో వందల మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా కానీ కేవలం కొంతమంది మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్ గా తరతరాలు గా కంటిన్యూ అవుతూ ఉంటారు. ఆ కొంతమందిలో ఒకరే మెలోడీ బ్రహ్మ మణిశర్మ కూడా ఒకరు.ఈయన అందించే సంగీతం కోసం మన టాలీవుడ్ టాప్ హీరోలు కూడా క్యూలు కడుతారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున , వెంకటేష్, మహేష్ బాబు ,పవన్ కళ్యాణ్ మరియు ఎన్టీఆర్ ఇలా ప్రతీ హీరో సినిమాకి పని చేసిన ఏకైక సంగీత దర్శకుడు మణిశర్మ. అతి తక్కువ సమయం లో అద్భుతమైన క్వాలిటీ మ్యూజిక్ అందించడం ఆయన వల్లే అయ్యేది.
అందుకే ప్రస్తుతం టాలీవుడ్ లో థమన్ మరియు దేవిశ్రీ ప్రసాద్ మేనియా నడుస్తున్నప్పటికీ కూడా మణిశర్మ కి స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించే ఛాన్స్ దక్కించుకుంటున్నాడని తెలుస్తుంది..రీసెంట్ గా ఆయన నుండి విడుదలైన బ్లాక్ బస్టర్ ఆల్బం ‘ఆచార్య’.సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా పాటల పరంగా ఆల్బం పెద్ద హిట్టే. కేవలం ఈ సినిమాలోని పాటల వల్లే ఈ చిత్రానికి విడుదలకు ముందు భారీ స్థాయి అంచనాలు కూడా ఏర్పడ్డాయి. రీసెంట్ గా ఆయన శాకుంతలం చిత్రానికి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉండగా మణిశర్మ కొడుకు మహతి సాగర్ కూడా టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఫుల్ బిజీ అవుతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించి విడుదలకు సిద్ధం గా ఉన్న లేటెస్ట్ చిత్రం ‘భోళా శంకర్ కి కూడా మహతి సాగర్ సంగీతం అందించాడు. నిన్న ఈ సినిమాలోని మొదటి పాటకి సంబంధించిన ప్రోమో ని విడుదల చేసారని తెలుస్తుంది.రేపు పూర్తి స్థాయి పాటని విడుదల చెయ్యనున్నారని సమాచారం.. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా మహతి సాగర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన చేసిన కొన్ని చిలిపి పనుల గురించి చెప్పుకొచ్చాడని సమాచారం.. ఆయన మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటి నుండి మొబైల్స్ అంటే పిచ్చి, నా దగ్గర చిన్నప్పటి నుండే భారీ కలెక్షన్ అయితే ఉండేది. మార్కెట్ లోకి ఏ కొత్త మొబైల్ వచ్చినా కూడా వెంటనే కొనేస్తూ ఉంటాను. మా నాన్న గారి క్రెడిట్ కార్డు ని దొంగతనం చేసి అలా ఎన్ని మొబైల్స్ కొన్నానో అస్సలు లెక్కే లేదు, క్రెడిట్ కార్డు బిల్స్ చూసిన తర్వాత నాన్న షాక్ కి గురి అయ్యేవాడు’ అంటూ మహతి సాగర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.మహతి సాగర్ భోళా శంకర్ చిత్రానికి ముందు భీష్మ మరియు చలో మరియు మాచెర్ల నియోజకవర్గం వంటి సినిమాలకు ఆయన సంగీతం అందించాడు.