సాధారణంగా మనం ఉదయం లేవగానే మొదటగా స్నానం చేస్తాం.. ఎందుకంటే.. స్నానం చేయడంతో మనసంతా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. మరికొందరు ఉదయం, సాయంత్రం రెండుపూటలు స్నానం చేస్తారు. రోజంతా బయటకు వెళ్లి ఇంటికి వచ్చే సరికి చెమట, దుమ్ము, ధూళితో మన బాడీపై అనేక వ్యర్థాలు పేరకుపోయి ఉంటాయి. స్నానం చేయడంతో చర్మంపై ఉన్న జిడ్డు తొలగిపోవడంతో పాటు.. మనసుకు, బాడీకి రిలాక్స్ గా ఉంటుంది.
Read Also: Police Open Fire: కోయంబత్తూరులో యువతిపై అత్యాచారం… నిందితులపై కాల్పలు
స్నానం చేసేటపుడు మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం.. అయితే.. వీటి వల్ల మనకు ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చే. తాజాగా ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అవేంటంటే.. స్నానం చేసేటప్పుడు ముందుగా తలపై నీరు పోసుకోవడం ప్రమాదకరమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. తలపై నీరు పోయగానే శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా మారి, రక్త ప్రసరణ తలవైపు పెరిగి రక్తనాళాలు పగిలే ప్రమాదం ఉంటుందంటున్నారు. దీంతో హర్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉండవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. స్నానం చేసేటపుడు ముందుగా పాదాలపై నీరు పోయాలి.. దీంతో మన శరీరానికి ఉష్ణోగ్రత మార్పును సహజంగా అంగీకరిస్తోందని తెలిపారు. అనంతరం మిగిలిన బాడీ పార్ట్స్ పై నీరు పోసుకుని.. తర్వాత తలపై నీరు పోసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల శరీరానికి ఉష్ణోగ్రత మార్పును శరీరం సహజంగా అంగీకరిస్తోందని తెలిపారు. అంతేకాదు.. కొందరు తెల్లగా మెరిసే చర్మం కోసం ఎక్కువ సేపు శరీరం పై స్క్రబ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చర్మం పై భాగం పగిలిపోయి ఇన్ఫెక్షన్స్ వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Read Also:Bangalore Shocker: అసలు ఈమె మనిషేనా.. కుక్క పిల్లను చంపి..
కానీ ఈ విషయాలన్నీ కేవలం ఇంటర్నెట్ నుంచి సేకరించినవిగా గుర్తించాలి.. మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని కోరుతున్నాం..