బెంగళూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ లో కుక్క పిల్లను దారుణంగా చంపేంసి.. పైగా ఎమి ఎరుగనట్లు బయటకు వచ్చింది ఓ పని మనిషి. ఆమె కుక్క పిల్లను చంపిన విజువల్స్ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read Also: Police Open Fire: కోయంబత్తూరులో యువతిపై అత్యాచారం… నిందితులపై కాల్పలు
పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో స్థానికులు విస్తుపోయే సంఘటన చోటు చేసుకుంది. ఓ పని మనిషి లిఫ్ట్ లో కుక్క పిల్లను దారుణంగా చంపేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. ఓ అపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పనిమనిషికి తమ కుక్కపిల్లను చూసుకోమని ఓనర్ చెప్పారు. దీంతో మహిళ కుక్క పిల్లను తీసుకుని లిప్ట్ లోకి తీసుకెళ్లి .. దారుణంగా నేలకొట్టి చంపింది. అనంతరం ఏమీ జరగనట్లు ప్రవర్తించిన ఆమె లిఫ్ట్ నుంచి బయటకు వస్తున్న సీసీటీవీ కెమెరా దృశ్యాలు చూసి అందరూ షాక్ అయ్యారు.
Read Also: Warning: స్నానం చేసేటపుడు మొదట అలా చేస్తున్నారా.. అయితే బీకేర్ ఫుల్..
ఈ ఘటనపై అపార్ట్‌మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంపుడు జంతువుపై జాలి లేకుండా కొట్టి చంపినందుకు కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కుక్కపిల్ల యజమాని రాశి పుజారీ పనిమనిషి పుష్పలత పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాగలూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు పని మనిషిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఇక, ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్‌లు పనిమనిషిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న కుక్కపిల్లను అంత కౄరంగా చంపడానికి మనసు ఎలా వచ్చింది.. నువ్వు అసలు మనిషివేనా..? అంటూ నెటిజన్లు మండిపడ్డారు.
Heartless Woman Caught on CCTV Killing Innocent Puppy Inside Lift Humanity at Its Lowest 💔🐾
In a horrifying act of inhumanity, a domestic worker in Bengaluru was caught on CCTV killing a helpless puppy by throwing it inside an apartment lift. The woman, who was trusted and… pic.twitter.com/mFnrpYFVKB
— Karnataka Portfolio (@karnatakaportf) November 3, 2025