ప్రస్తుతం శీతాకాలం నడుస్తోంది. శీతాకాలంలో జనాలకు తమ ఆహారం విషయంలో చాలా ప్రశ్నలు మదిలో మెదులుతుంటాయి. అందులో ప్రదమైనది ‘పెరుగు’. వేసవిలో మనం పెరుగును తినడానికి ఎంతో ఇష్టపడతాము. కానీ శీతాకాలం వచ్చిన వెంటనే చాలా మంది పెరుగు తినడం మానేస్తారు. శీతాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు, ఫ్లూ, గొంతు నొప్పి వస్తుందని అనుకుంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముంది, అది అపోహ మాత్రమేనా? అనే విషయం తెలుసుకుందాం.
కాల్షియం, భాస్వరం, పొటాషియం సహా బి విటమిన్లు పెరుగులో పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలు బలపడడానికి, నాడీ వ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు, శక్తిని అందించడానికి సహాయపడతాయి. శీతాకాలంలో పెరుగు తినడం వల్ల శరీరం చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ అనే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. శీతాకాలంలో ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. శరీరం అనారోగ్యాలతో పోరాడటానికి సహాయపడుతుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ పేగు బాక్టీరియా సమతుల్యతను కాపాడుతుంది. శీతాకాలపు అనారోగ్యాల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.
Also Read: T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ ట్రోఫీ కోసం.. న్యూజిలాండ్ సీక్రెట్ ప్లాన్!
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా సహాయపడతాయి. శీతాకాలంలో జలుబు, ఫ్లూ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. రోజూ పెరుగు తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అంతేకాదు కాలానుగుణ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శీతాకాలంలో పెరుగును సరైన రీతి, పరిమాణంలో తీసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మీరు ఎప్పుడూ పుల్లగా లేదా ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన పెరుగును తినకూడదు. శీతాకాలంలో పెరుగును గది ఉష్ణోగ్రతలో ఉంచుకోవాలి. రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన వెంటనే పెరుగు తినకూడదు. ఎందుకంటే చల్లని పెరుగు గొంతు నొప్పి, దగ్గును మరింత తీవ్రతరం చేస్తుంది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు సాయంత్రం 5 గంటల తర్వాత పెరుగును తీసుకోకూడదు.
గమనిక: ఈ న్యూస్ కేవలం సమాచారం కోసం మాత్రమే. మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.